Proper Facilities in Hostels : వ‌స‌తి గ్రుహాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి..

అనంతపురం రూరల్‌: ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన బాధ్యత వార్డెన్లపై ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు వడిత్యా శంకర్‌నాయక్‌ అన్నారు. మంగళవారం అనంతపురంలోని నవోదయ కాలనీలో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహన్ని ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు.

DLED Course: డీఎల్‌ఈడీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం. వీళ్లు అర్హులు

వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని వార్డెన్‌కు సూచించారు. మెనూ సక్రమంగా అమలు చేయడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు ట్యూటర్లను ఏర్పాటు చేసి, ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించేలా చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్‌ ప్రిన్సిపాల్‌ పార్వతి తదితరులు పాల్గొన్నారు.

#Tags