Mass Copying Using AI Technology : వీడు సామాన్యుడు కాదు.. ఏకంగా AI టెక్నాలజీతో పరీక్షల్లో కాపీ కొట్టాడిలా.. చివ‌రికి..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ విద్యార్థి చేసిన ప‌నికి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఇదేదో మంచి ప‌ని చేశాడు అనుకునేరు. చేసేది తప్పు అయినా అందులో అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడాడు ఈ విద్యార్థి.

ఒక చిన్న స్మార్ట్‌ఫోన్‌ను క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లో దాచిపెట్టాడు. అతని షర్ట్ బటన్‌లో హై డెఫినిషన్ కెమెరా ఉంచి... చెవిలో చిన్న హెడ్‌సెట్‌ను పెట్టుకున్నాడు. అతని షర్ట్ బటన్‌లోని కెమెరా ప్రశ్నాపత్రాన్ని స్కాన్ చేస్తోంది. వెంటనే వాటికి ఆన్సర్స్ చెప్పడానికి స్మార్ట్‌ఫోన్ AI టెక్నాల‌జీని యాక్సెస్ యూస్ చేశాడు. ఆ తర్వాత హెడ్‌సెట్ ద్వారా సమాధానాలు విన్నాడు. అన్ని టెక్నాలజీ వాడి కరెక్ట్ టైమింగ్ లో ఎగ్జామ్ రాయాలనుకున్నాడు. అంతా అతను అనుకున్న‌ట్టు జ‌రిగితే ఇందులో ట్వీస్ట్ ఏముంది.

ఇదంతా చూసి పోలీసులు..

చివ‌రికి పోలీసులకు దొరికిపోయాడు. ఇదంతా చూసి పోలీసులు కూడా షాక్ తిన్నారు. విద్యార్థి ChatGPTని ఉపయోగించినట్లు తేలింది. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అతని కదలికలు ఇన్విజిలేటర్ పసిగట్టారు. పక్కకు తీసుకెళ్లి చెక్ చేస్తే మొత్తం వ్యవహారం బయట పడింది. కాపీ కొట్టిన అతన్ని, అతనికి హెల్ప్ చేసిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు. యూనివర్సిటీ ప‌రీక్ష‌లు వచ్చాయ్ అప్పటికప్పుడు చదవడం అంటే తన వల్ల కాదనుకున్నాడేమో.. ఓ స్మార్ట్ ఐడియా వేశాడు. టర్కిష్ లో ఎగ్జామ్ లో కృత్రిమ మేధస్సు AIను ఉపయోగించి దొరికిపోయాడు. పరీక్షలో కాపీ కొట్టేందుకు విద్యార్థి అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఇస్పార్టా పోలీసులు తెలిపారు. అతను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడిన తన షూ అరికాలిలో రూటర్‌ను పెట్టుకున్నాడు. ఈ తెలివి ఎదో చ‌ద‌వ‌డం మీద పెట్టితే.. క‌నీసం పాస్ అన్నా అవుతావ్‌గా అని నెటిజన్లు అంటున్నారు.

#Tags