Exams In March 2024: మార్చి నెల మొత్తం పరీక్షల కాలమే, ముఖ్యమైన తేదీలు ఇవే..

దేశ వ్యాప్తంగా మార్చి నెలంతా పరీక్షల కాలమే. పోటీ పరీక్షలు, అకడమిక్‌ పరీక్షలతో విద్యార్థులు, యువత పుస్తకాలతో కుస్తీపడుతున్నారు.ఇప్పటికే పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు మొదలైపోయాయి. ఓవైపు వార్షిక పరీక్షలు రాస్తుండగానే, మరోవైపు ప్రవేశ పరీక్షల తేదీలు దగ్గరపడుతున్నాయి.

వీటితో పాటు ఇప్పటికే దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర నియామక సంస్థలు, విద్యాసంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రవేశాలకు ఇప్పటికే నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి నెలలో జరుగనున్న మొత్తం పరీక్షల షెడ్యూల్‌ను ఓసారి చూసేద్దాం. 

1. SBI- ఎస్‌బీఐ క్లర్క్‌ పరీక్ష: మార్చి 04, 2024
2. NICL- ఎన్‌ఐసీఎల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(స్పెషలిస్ట్‌, జనరలిస్ట్‌) పరీక్ష: మార్చి 04, 2024
3. GIC- ఇండియా ఆఫీసర్‌ స్కేల్‌-1 పరీక్ష: మార్చి 09, 2024
4. UPSCCISF AC(EXE) LDCE-2024 పరీక్ష: మార్చి 10, 2024
5. HPSC HCS జ్యుడీషియల్‌ ప్రిలిమినరీ పరీక్ష: మార్చి 03, 2024
6. రాజస్థాన్‌ హైకోర్టులో సిస్టమ్‌ అసిస్టెంట్‌ పరీక్ష: మార్చి 03, 2024
7. చండీఘర్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్ష: మార్చి 03, 2024
8. ఢిల్లీ జూనియర్‌ ఇంజనీర్‌/సెలక్షన్‌ ఆఫీసర్‌ టైర్‌-2 పరీక్ష: మార్చి 04, 2024
9. ఢిల్లీ పీజీటీ(అగ్రికల్చర్‌)పరీక్ష: మార్చి 04,2024
10. MAHATRANSCO- టెక్నీషియన్‌-II(02/2024)పరీక్ష: మార్చి 10, 2024
11. MAHATRANSCO- టెక్నీషియన్‌-II(08/2023)పరీక్ష: మార్చి 10, 2024
12. MPPSC- స్టేట్‌ సర్వీస్‌ మెయిన్స్‌ పీక్ష: మార్చి 11-16 వరకు
13. చంఢీగర్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌-JBT 2023 పరీక్ష: మార్చి 17,2024
14. అస్సాం PSC కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామ్ 2023 రీషెడ్యూల్డ్ ప్రిలిమ్స్ పరీక్ష తేది: మార్చి 18, 2024
15. HPPSC – PGT స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఎగ్జామ్‌: మార్చి 29, 2024
16. ఢిల్లీ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ పరీక్ష తేది: మార్చి 20,2024
17. DSSSB- వివిధ పోస్టులకు పరీక్షలు: మార్చి 03-31 వరకు జరగనున్నాయి. 

 

#Tags