Environmental Awareness: విద్యార్థుల్లో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న క‌ల్పించాలి..

ప‌ర్యావ‌ర‌ణం గురించి విద్యార్థుల‌కు పాఠ‌శాల స్థాయి నుంచే అవ‌గాహ‌న క‌ల్పించాలి. ప్ర‌స్తుతం, ఉన్న ప‌రిస్థితి గురించి వివ‌రించి ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌ వైపు ప్రోత్సాహించాలి..

భీమవరం: సమాజంలో అభివృద్ధి పెరిగే కొద్దీ పుడమి తల్లికి కష్టాలు తప్పడం లేదు. పెరుగుతున్న జనాభా, విలాసవంతమైన జీవన విధానంలో నీరు, భూమి, గాలి సైతం కలుషితమవుతున్నాయి. దీంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఆధునికత పేరుతో చెట్ల పెంపకం తగ్గడం, ప్లాస్టిక్‌ వాడకం పెరగడంతో ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకవైపు ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెట్ల తొలగింపు, పరిశ్రమలు, వాహనాలతో కాలుష్యం రెట్టింపు అవుతోంది. ఫలితంగా భూతాపం రోజురోజుకు పెరిగి సకాలంలో వర్షాల రాక తగ్గిపోయింది. దీనికి తోడు విపత్తులు చోటు చేసుకుని భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ తన పరిధిలో పుడమితల్లిని కాపాడుకునేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీనిలో భాగంగానే ప్రతి ఏటా జూన్‌ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది.

Employment Courses: యువ‌కుల‌కు శిక్ష‌ణ‌తో ఉపాధి అవ‌కాశం.. ఇలా..!

పాఠశాల స్థాయి నుంచే అవగాహన

పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధంగా ఇంటర్‌ ప్యానల్‌ ఇన్‌క్లైమేట్ చేంజ్‌ (ఐపీసీసీ) పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించింది. పొల్యూషన్‌ బోర్డు, విద్యుత్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, అటవీ, విద్యాశాఖల సంయుక్త ఆధ్యర్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో బుధవారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Parents Role In Child Education: చదువు ఎంపికలో పిల్లల మాట కూడా వినండి

షెడ్యూల్‌ ఇలా..

5వ తేదీన ప్లాస్టిక్ట్‌ ఉపయోగించరాదని చెప్పే కార్యక్రమాలను పాఠశాలల్లో నిర్వహించారు. పర్యావరణ అనుకూల వస్తువులను వాడడం, ప్లాస్టిక్‌ వాడకానికి వ్యతిరేకంగా పోస్టర్లు, జనపనార వస్తువుల వాడకం, పర్యావరణ అనుకూల ఆలవాట్లు పెంపొందించడం వంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. అలాగే ఈ నెల 12న ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల ఆధ్వర్యంలో నీటి లీకేజీని అరికట్టడం, పైపుల లీకేజీని తనిఖీ చేయడం, నీటి స్వచ్ఛత పరీక్షల నిర్వహణ, నీటి సంరక్షణ ర్యాలీ, వర్షపు నీటి నిల్వ వ్యవస్థలపై అవగాహన కార్యక్రమాలు పాఠశాలల్లో చేపట్టనున్నారు.

Election Commission: సార్వత్రిక ఎన్నికల్లో 65.79 శాతం పోలింగ్‌

13న విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో ఎనర్జీ సేవింగ్‌ యాక్టివి ఎకో క్లబ్‌ ఎనర్జీ టీమ్‌తో డ్యూటీ రోస్టర్‌, నాలెడ్జ్‌ బిల్డింగ్‌ సమీక్షలు, పోస్టర్లు, బ్యానర్లు వంటి ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 14న పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో శుభ్రత, వ్యర్థాలను వేరు చేయడం, తరగతి గదుల్లో రెండు డస్ట్‌బిన్‌ల ఏర్పాటు, శానిటరీ వ్యర్థాలు, కంపోస్ట్‌ పిట్లు, వస్త్రాలు, బొమ్మలు వంటి వివరాల డ్రైవ్‌ నిర్వహించడం, కమ్యూనిటీ సభ్యులతో ఇంటరాక్టివ్‌ వంటివి నిర్వహిస్తారు. 15న పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో వ్యర్థాలను సేకరించడం, భూమిపై వ్యర్థాల ప్రభావంపై విద్యార్థులతో చర్చించడం వంటి కార్యక్రమాలు చేపడతారు.

Employment Courses: యువ‌కుల‌కు శిక్ష‌ణ‌తో ఉపాధి అవ‌కాశం.. ఇలా..!

18న కిచెన్‌ గార్డెన్లను అభివృద్ధి చేయడం, ప్లాస్టిక్‌ సీసాలు వంటి అందుబాటులో ఉన్న పదార్థాలను ఉపయోగించడం, వ్యర్థాలతో పర్యావరణ అనుకూల ఎరువులు, మొక్కల పెరుగుదల, ఉత్పత్తి రికార్డు నిర్వహించడం, పర్యావరణ ప్రయోజనాలపై చర్చించడం వంటి కార్య క్రమాలను నిర్వహిస్తారు. 19న నేచర్‌ నాక్‌, ప్లాంటేషన్‌ డ్రైవ్‌, పర్యావరణ శాస్త్రం, చరిత్ర, భౌగోళిక ఆధారాలు, సంప్రదాయాలను పరిశీలన కోసం సమీప గ్రామాల సందర్శన వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

విజయవంతం చేయాలి

పాఠశాలల్లో పర్యావరణ చైతన్య కార్యక్రమాలను విజయవంతం చేయాలి. నీటి వృథాను అరికట్టడం, మొక్కలను నాటడం, విద్యుత్తు ఆదా, వ్యర్థాలను పునర్వినియోగం వంటి కార్యక్రమాల్లో ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్చంద సంస్థలు పర్యావరణ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసేలా కృషి చేయాలి.

– పి.శ్యామ్‌సుందర్‌, జిల్లా సర్వశిక్ష అడిషినల్‌ ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌, భీమవరం

UPSC Prelims Admit Card 2024: యూపీఎస్సీ సివిల్స్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

అన్ని పాఠశాలల్లో నిర్వహించాలి

పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని పాఠశాలల్లో 19వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలి. నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం పాఠశాలల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలి.

– యండమూరి చంద్రశేఖర్‌, ఎస్‌ఎస్‌ఏ సీఎంఓ, భీమవరం

#Tags