E CET Counselling 2024 : ఇంజ‌నీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశానికి కౌన్సెలింగ్ ప్రారంభం.. కావాల్సిన ధ్ర‌వ‌ప‌త్రాలు ఇవే..

పాలిటెక్నిక్‌ అర్హతతో బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఈ–సెట్‌ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్‌ ప్రక్రియ షురూ అయింది. సాంకేతిక విద్యాశాఖ మార్గదర్శకాల మేరకు అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 30వ తేదీ వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన పక్రియ ఆరంభమవుతుంది. జులై 8న సీట్లను కేటాయిస్తారు.

కడప: జిల్లాలో ఈ-సెట్‌ ఫలితాల విడుదలతో కౌన్సిలింగ్‌ పక్రియ మొదలవుతుంది. ఈసెట్‌ ర్యాంకు సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి హాల్‌ టికెట్‌, జనన తేదీ వివరాలతో ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1200, ఎస్సీ, ఎస్టీలైతే రూ.600 చొప్పున ప్రాసెసింగ్‌ ఫీజు ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌ వే ద్వారా చెల్లించాలి. ర్యాంకు సాధించిన విద్యార్థులు హెల్ప్‌లైన్‌ కేంద్రాలకు విధిగా వెళ్లాల్సిన అవసరం లేదు. అనంతరం పేమెంట్‌ రసీదు, పదో తరగతి, పాలిటెక్నిక్‌ మార్కుల జాబితాలు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన తర్వాత కేంద్రాలలో జులై 3న వెబ్‌ ఆధారిత విధానంలో పరిశీలిస్తారు. జులై 1 నుంచి 4వతేదీ వరకు ఆన్‌లైన్‌లో వెబ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. ఆపై కళాశాలల ఎంపికకు ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 5న మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. 8న సీట్లు కేటాయిస్తారు.

NTA Releases New Exam Schedule: యూజీసీ నెట్‌ కొత్త పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్టీఏ

వెబ్‌ ఆప్షన్ల నమోదు

రిజిస్ట్రేషన్‌ సమయంలో హాల్‌ టికెట్‌ నెంబర్‌, జనన తేదీ వివరాలు సమర్పించిన విద్యార్థులకు ధ్రువపత్రాల వివరాలు కంప్యూటర్‌ స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినట్లు .. కంప్యూటర్‌ స్క్రీన్‌పై కనిపిస్తే విద్యార్థులు షెడ్యూల్‌ ప్రకారం నేరుగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. క్యాండిడేట్‌ ఈజ్‌ నాట్‌ ఎలిజబుల్‌ ఫర్‌ ఎక్సర్‌ౖౖసైజ్‌ ఆప్షన్‌ అని ఆసంపూర్తిగా ఉన్న వాటిని గమనించి విద్యార్థులు హెల్ప్‌లైన్‌ కేంద్రంలో పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పురోగతిలో ఉన్నట్లు స్క్రీన్‌పై కనిపిస్తే విద్యార్థులు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు సిద్ధమవుతారు. వైఎస్సార్‌ జిల్లాకు సంబంధించిన విద్యార్థులకు అనువుగా ఉండేందుకు కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలను హెల్ప్‌లై న్‌ కేంద్రంగా ఏర్పాటు చేశారు.

Free Skill Training : వివిధ కోర్సుల్లో మూడు నెల‌ల ఉచిత నైపుణ్య శిక్ష‌ణ‌.. ద‌ర‌ఖాస్తులు ఇలా!

ఆన్‌లైన్‌లో సమస్య ఉంటే కేంద్రానికి రావాలి

అభ్యర్థులకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడి ధ్రువ పత్రాల పరిశీలన అసంపూర్తిగా ఉంటే మాత్రమే కడప మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ కేంద్రానికి హాజరు కావాలి. అది కూడా అభ్యర్థికి సంబంధించిన అన్ని ధ్రుపవత్రాలతో రావాలి. ఏ సమస్య లేకుంటే మాత్రం ఆన్‌లైన్‌లోనే పత్రాల పరిశీలన చేస్తారు.

– సీహెచ్‌. జ్యోతి, ఈ–సెట్‌ కౌన్సిలింగ్‌ కో ఆర్డినేటర్‌

AP PGCET 2024 State Rankers : పీజీసెట్ ఫ‌లితాల్లో స్టేట్ ర్యాంకుల‌ను సాధించిన డిగ్రీ విద్యార్థులు..

#Tags