Dussehra Holidays 2022 : రేపటి నుంచే కాలేజీలకు దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?
తెలంగాణలో ప్రధాన పండుగలైన బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు భారీగా సెలవులను ప్రకటించింది.
కాలేజీలకు సెలవులు ఇలా..
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఇంటర్ కాలేజీలకు అక్టోబర్ 2వ తేదీ నుంచి 9 వరకు.. ఎనిమిది రోజుల పాటు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రైవేట్, ఎయిడెడ్, ప్రభుత్వ కాలేజీలన్నింటికీ ఈ సెలవులు వర్తిస్తాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
AP Schools Dussehra Holidays : ఏపీలో స్కూల్స్‌కు దసరా సెలవులు ఇంతేనా..? తెలంగాణలో మాత్రం..
మొదట విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులను జులై 1 నుంచి ప్రారంభించింది ఇంటర్ బోర్డ్. ‘‘ఈ ఏడాది మొత్తం 221 పని దినాలు ఉంటాయని తెలిపింది. జూన్ 15 నుం చి సెకండ్ ఇయర్, జులై 1 నుంచి ఫస్ట్ ఇంటర్ తరగతులు ప్రారంభించారు. అకడమిక్ క్యాలెండర్ విడుదల సమయంలోనే.. అక్టోబరు 2 నుంచి 9 వరకు దసరా సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డ్ వెల్లడించింది.
Telangana Dussehra Holidays 2022 : దసరా సెలవులు.. విద్యార్థులకు మరో శుభవార్త ఇదే..
అన్ని విద్యాసంస్థలు తిరిగి..
అన్ని స్కూళ్లకు ప్రభుత్వం సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 9 వరకు 15 రోజుల పాటు సెలవులు ప్రకటించించిన విషయం తెల్సిందే. అలాగే అక్టోబర్ 10వ తేదీన అన్ని విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి.
అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగగా ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే భారీగా హాలీడేస్ ను ప్రకటించారు. అలాగే ఇప్పటికే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూల్స్‌కు, కాలేజీలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాయి.