Best School in State Level : రాష్ట్ర స్థాయిలో ఉత్త‌మ పాఠ‌శాల‌గా ఏపీజే అబ్దుల్ క‌లామ్ హైస్కూల్‌.. విద్యార్థులు కూడా..

పేద విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం స్మారక మున్సిపల్‌ మెమోరియల్‌ హైస్కూల్‌గా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది.

కర్నూలు: పేద విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం స్మారక మున్సిపల్‌ మెమోరియల్‌ హైస్కూల్‌గా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పాఠశాల హెచ్‌ఎం అవార్డును అందుకోనున్నారు. ఈ పాఠశాలను 2016లో ఏర్పాటు చేయగా.. 2020లో డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం స్మారక మున్సిపల్‌ మెమోరియల్‌ హైస్కూల్‌గా మార్పు చేశారు. ఈ పాఠశాలలో 2020–21 నుంచి పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత శాతం సాధిస్తూ వస్తున్నారు.

IIT Madras: దేశంలోనే టాప్‌-1గా ఐఐటీ మద్రాస్‌..ఎందుకంత స్పెషల్‌? ప్లేస్‌మెంట్స్‌ కారణమా?

ఈ ఏడాది 48 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ 500 మార్కులకుపైగా సాధించారు. ఈ స్కూల్‌కు చెందిన షేక్‌ హూమేరా ఇక్బాల్‌ 593, కె. అనన్యక్రితి 586 మార్కులు సాధించారు. ఈ స్కూల్‌లో చదివిన విద్యార్థుల సరాసరి మార్కులు 546 కావడం విశేషం. అడ్వాన్స్‌ ఫౌండేషన్‌ శిక్షణ పొందిన ఉత్తమ ఉపాధ్యాయుల బృందం ఉండడంతో పాటు ప్రత్యేక ప్రణాళికలతో కార్పొరేట్‌ స్కూళ్లకు మించి ఇక్కడ ఫలితాలు వస్తున్నాయి. వరుసగా మూడోసారి రాష్ట్ర స్థాయిలో మున్సిపల్‌ స్కూల్‌ విభాగంలో ఈ పాఠశాల అవార్డుకు ఎంపికైంది. ఈ విభాగంలో రాయలసీమ జిల్లాల్లో ఎంపికైన ఏకైక స్కూల్‌ కావడం విశేషం.

Paetongtarn Shinawatra: థాయ్‌లాండ్‌ ప్రధానిగా పేటోంగ్‌టార్న్‌ షినవత్ర..

అత్యుత్తమ బోధనతోనే అవార్డు

వరుసగా మూడోసారి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్కూల్‌ అవార్డు రావడం, ఆ మూడు ఆవార్డులను నేనే అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో అన్ని యాజమాన్యాలలో వరుసగా మూడోసారి అవార్డు పొందిన ఏకై క స్కూల్‌ మాదే కావడం ఆనందంగా ఉంది. అత్యుత్తమ బోధనతోనే అవార్డు మా పాఠశాలకు అవార్డు వచ్చింది.

– విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు

TUTF: హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

#Tags