Distance Courses: దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ (UGC).. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సుల కోసం అర్హత గల విద్యాసంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఈ తరహా కోర్సులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలయ్యింది. ఈనెల 31తో అప్లికేషన్ గడువు ముగుస్తుంది.
వచ్చే సంవత్సరం 2025, ఫిబ్రవరి నుంచి కోర్సులు ప్రారంభం అవుతాయి. దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యాసంస్థలు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా https://deb.ugc.ac.in/ద్వారా అప్లై చేసుకోవచ్చు.
Bank Jobs: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
కాగా వివిధ కారణాలతో కాలేజీకి వెళ్లి చదవలేని వాళ్లు, చదువు మధ్యలో ఆపేసిన వాళ్లను ప్రోత్సహించేందుకు ఓపెన్,డిస్టెన్స్ లెర్నింగ్ తరహాలో కోర్సులు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఓపెన్, డిస్టెన్స్ విధానంలో కోర్సులను అందించేందుకు యూనివర్సిటీలు యూజీసీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
#Tags