CSIR UGC NET Exam 2024 Postponed: ఎన్టీఏ మరో కీలక ప్రకటన..సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్ పరీక్ష వాయిదా, కారణమిదే!
నీట్ పేపర్ లీకేజీపై దుమారం చెలరేగుతున్న వేళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీయే) మరో పరీక్షను వాయిదా వేసింది. ఈనెల 25,26,27 తేదీల్లో జరగాల్సిన సీఎస్‌ఐఆర్–యూజీసీ–నెట్ ఉమ్మడి పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.
అనివార్య కారణాలతో పరీక్షను వాయిదా వేసినట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. పరీక్ష తేదీని త్వరలోనే వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని వివరించింది. అయితే, పేపర్ లీకైందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
NEET-UG Re-Exam: ముగిసిన నీట్ రీ-ఎగ్జామ్.. సగం మంది అభ్యర్థులు డుమ్మా
కాగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అత్యున్నత విద్యా సంస్థల్లో సైన్స్ కోర్సుల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు సీఎస్‌ఐఆర్–యూజీసీ–నెట్ పరీక్షను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే.
#Tags