Counselling for Gurukul Admissions: గురుకులంలో 5వ తరగతి ప్రవేశానికి కౌన్సెలింగ్‌..

5వ తరగతి విద్యా‍ర్థులు గురుకులంలో చేరేందుకు ఆసక్తి ఉన్నవారు ఈ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు ప్రిన్సిపాల్‌ రత్నవల్లి..

విశాఖ విద్య: ఉమ్మడి విశాఖ జిల్లాలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు విశాఖపట్నంలోని శ్రీ కృష్ణాపురం గురుకులంలో ఈ నెల 18న కౌనెల్సింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ రత్నవల్లి తెలిపారు. విశాఖ జిల్లాలోని శ్రీ కృష్ణాపురం, అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం, గొలుగొండ, దేవరాపల్లి గురుకుల పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. విద్యార్థులు తమకు సంబంధించిన అన్ని రకాల విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, తల్లి లేదా తండ్రి ఆధార్‌ కార్డు తీసుకుని రావాలన్నారు.

Students Education: చదువులో విద్యార్థుల స్థాయిని గుర్తించాలి..

కౌన్సెలింగ్‌ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, మెరిట్‌తో పాటు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుగుణంగా సీట్లు భర్తీ చేస్తామన్నారు. ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులతో ఇప్పటికే ఆన్‌లైన్‌ విధానంలో సీట్ల భర్తీ జరిగిందన్నారు. శ్రీ కృష్ణాపురంలో 22 ఖాళీల్లో ఎస్సీ–20, బీసీ–2, దేవరాపల్లిలో 52 ఖాళీల్లో ఎస్సీ–50, బీసీ–1, ఎస్టీ–1 సీట్లు, గొలుగొండలో 23 ఖాళీల్లో ఎస్సీ–18, బీసీ–2, ఎస్టీ–2, ఎస్టీ–1, సబ్బవరం గురుకులంలో 29 ఖాళీల్లో ఎస్సీ–23, బీసీ–3, ఎస్టీ–2, ఓసీ–1 సీట్లను అర్హులైన విద్యార్థులతో భర్తీ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Admission Test: 6వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష.. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ ఇలా..

#Tags