Counselling for Gurukul Admissions: ఈ రెండు తేదీల్లో గురుకుల పాఠశాలల్లో చేరేందుకు కౌన్సెలింగ్‌..

గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో చేరేందుకు ఆసక్తి ఉన్న వారు ప్రకటించి తేదీ, గురుకుల పాఠశాలలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని తెలిపారు జిల్లా సమన్వయ అధికారి భారతి..

ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు బాలురకు పెదవేగి గురుకుల పాఠశాలలో ఈనెల 22న, బాలికలకు పోలసానిపల్లి గురుకుల పాఠశాలలో ఈ నెల 23న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయ అధికారి యన్‌.భారతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెదవేగి, చింతలపూడి, ఆరుగొలను, నరసాపురం, న్యూ ఆరుగొలను గురుకుల పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న బాలికలు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల పెదవేగిలో ఈ నెల 22వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు.

Department of Education: వయోజన విద్యకు శ్రీకారం

పోలసానిపల్లి, వట్లూరు, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, నూజివీడు, ఆచంట గురుకుల బాలుర పాఠశాలల్లో చేరేందుకు పోలసానిపల్లి గురుకుల పాఠశాలలో ఈ నెల 23న ఉదయం 9 గంటలకు నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నారు. ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులతో ఇప్పటికే ఆన్‌లైన్‌ విధానంలో సీట్ల భర్తీ జరిగినట్లు తెలిపారు. మెరిట్‌తో పాటు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌కు అనుగుణంగా మిగిలిన సీట్లను భర్తీ చేస్తామన్నారు.

Annual Day Celebrations: ఉద్యాన కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు..

కౌన్సెలింగ్‌కు హాజరయ్యే ద్యార్థులు ప్రవేశపరీక్ష హాల్‌ టికెట్‌, ర్యాంక్‌ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, నాలుగో తరగతి స్టడీ సర్టిఫికెట్‌, ఆధార్‌ వెంట తీసుకురావాలని సూచించారు. బాలురకు సంబంధించి ఎస్సీ–48, బీసీ–7, బీసీ (సీ)–26, ఎస్టీ–14, ఓసీ–1 కలిపి మొత్తం 96 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. బాలికలకు సంబంధించి ఎస్సీ–36, బీసీ–7, బీసీ(సీ)–31, ఎస్టీ–12, ఓసీ–1 కలిపి మొత్తం 87 సీట్ల ఖాళీలు ఉన్నట్లు జిల్లా సమన్వయ అధికారి ఎన్‌.భారతి వివరించారు.

Free Coaching for Civils: సివిల్స్‌ సర్వీసెస్‌ కోసం ఉచిత శిక్షణ.. దరఖాస్తులకు తేదీ..

#Tags