Entrance Exam: వచ్చేనెల 7న కాలేజీ ఆఫ్‌ ఎక్ట్సెన్స్‌ ప్రవేశ పరీక్ష

విద్యార్థులు ఈ పరీక్షతో మరింత ముందుకు సాగాలని సూచించారు ఐటీడీఏ పీఓ అభిషేక్‌. అందరూ ఉన్నత చదువులే లక్ష్యంగా నడవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన విద్యార్థులను ప్రోత్సాహిస్తూ మాట్లాడారు..

పాడేరు: గిరిజన విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించాలని స్థానిక ఐటీడీఏ పీవో అభిషేక్‌ సూచించారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు, వచ్చేనెల 7న జరగనున్న కాలేజీ ఆఫ్‌ ఎక్ట్సెన్స్‌ ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు సాధించాలనే లక్ష్యంతో గుత్తులపుట్టు, దిగువమెదాపుట్టు ఆశ్రమ పాఠశాలలో ప్రత్యేక బోధన తరగతుల నిర్వహించారు.

National Conference: విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు

ఈ సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందించే పోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చదువుల్లో రాణించి ఉన్నత స్థానంలో స్థిరపడినప్పుడు కుటుంబం, గ్రామం, ఉపాధ్యాయులు ఎంతో సంతోషిస్తారన్నారు. డీడీ కొండలరావు, ఏటీడబ్ల్యూవో రజని, హెచ్‌ఎంలు సింహాచలం, గంగాభవాని, మంజుల, రీమలి జాన్‌ పాల్గొన్నారు.

Summer Holidays 2024: ఇంటర్మీడియట్ 2024 వేసవి సెలవులు ఎప్పుడంటే... ఈ సారి 2 నెలలు!

#Tags