Collector Turns As Teacher: టీచర్‌గా మారిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నాంపల్లి: హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికార హోదాను కాసేపు పక్కన పెట్టి టీచర్‌గా మారిపోయారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పి ఆకట్టుకున్నారు. టీచర్లలో ఉత్తేజం నింపారు. ఈ సన్నివేశం గురువారం మల్లేపల్లిలో చోటుచేసుకుంది.
స్థానిక తెలుగు, ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని అన్ని తరగతి గదు లను సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. విద్యా ర్థులు చదువుతున్న తీరును గమనించారు. ఈ క్రమంలో ఆయన విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఉపాధ్యాయులతో బోధనలు చేయించారు. ‘పాఠం అర్థమైందా పిల్లలూ..’అని ఆరా తీశారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, డీఈఓ రోహిణి, తహసీల్దార్ జ్యోతి పాల్గొన్నారు.
#Tags