Collector: విద్యాధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

కర్నూలు(సెంట్రల్‌): సి. బెళగల్‌ మండలం బురాన్‌దొడ్డి–2 పాఠశాల ఆవరణలో మత్తు పదార్థాలు విక్రయించడంపై కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన డీఈఓ, ఎంఈఓలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసినా బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఎలా అని మండిపడ్డారు. పిల్లలు మత్తుకు బానిస అయితే ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండలస్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ నెల 16వ తేదీన బురాన్‌దొడ్డి–2 పాఠశాలల వద్ద మత్తు పదార్థాలు అమ్మువుతున్న విషయాన్ని తానే గమనించానన్నారు. అయినా వారిపై చర్యలు తీసుకోలేదని, మీ పిల్లలు చదివే పాఠశాలల్లో పరిస్థితి ఇలాగే ఉంటే వదిలేస్తారా అని విద్యాశాఖాధికారులను ప్రశ్నించారు. వెంటనే ఆమె ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి మత్తు పదార్థాలు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి బుధవారం సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, మహిళా పోలీసులు పాఠశాలలు, వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు దుప్పట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, సీపీఓ అప్పలకొండ, డ్వామా పీడీ అమర్‌నాథ్‌రెడ్డి, సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాల్‌, డీఈఓ రంగారెడ్డి, సెట్కూరు సీఈఓ రమణ పాల్గొన్నారు.

చ‌ద‌వండి: AP Govt Schools: భాషా పాఠాలకూ 'డిజిటల్‌' రూపం

పిల్లలు మత్తుకు బానిస అయితే ఎవరూ బాధ్యత వహిస్తారు బురాన్‌దొడ్డి–2 పాఠశాల ఆవరణలో మత్తు పదార్థాల విక్రయంపై కలెక్టర్‌ సీరియస్‌ కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫోన్‌లో ఆదేశాలు

#Tags