Cm Revanth Reddy Launches New Scheme: సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పాసైన వారికి బంపర్‌ ఆఫర్‌.. ఈ పథకానికి వీళ్లే అర్హులు

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు 'రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం' పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

SBI Circle Based Officer Final Results Out: ఎస్‌బీఐ సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో ఈ పథకాన్ని శనివారం ప్రారంభించారు. ఈ స్కీమ్‌ కింద సివిల్స్‌కు పాసైన అభ్యర్థులకు ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించనుంది. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న పేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. 

UPSC Civil Prelims Results 2024: యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల..

ఈ పథ​కం పొందడానికి ఈ అర్హతలు తప్పనిసరి

  • అభ్యర్థులు జనరల్‌(EWS)/బీసీ/ఎస్సీ/ఎస్టీలై ఉండాలి. 
  • తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి. 
  • కుటుంబ వార్షియ ఆదాయం రూ.8 లక్షల లోపు మాత్రమే ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థల శాశ్వత ఉద్యోగులు అనర్హులు
  • ఒకసారి మాత్రమే ఈ ప్రోత్సాహం అందుతుంది
     

#Tags