Professional Course Exams : ఈ కోర్సుల పరీక్షలకు తేదీలు మార్చాలి.. కారణం!
అమలాపురం టౌన్: ఆంధ్ర యూనివర్శిటీ (ఏయూ) పీజీ ప్రొఫెషనల్, డిప్లమో కోర్సు పరీక్షలకు ఇచ్చిన తేదీలు మార్పు చేయాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ శుక్రవారం రాత్రి అమలాపురంలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ రెండు కోర్సులకు ఇచ్చిన షెడ్యూల్‌లో ఈ నెల 30, 31 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఉందని వివరించారు. అయితే ఏపీపీఎస్సీ నిర్వహించే ఈవో అండ్ జీవో పరీక్షలు కూడా ఈనెల 30, 31 తేదీల్లో జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
Microsoft: తీవ్ర అంతరాయం.. విశ్వవ్యాప్తంగా స్తంభించిన మైక్రోసాఫ్ట్ సేవలు.. కారణం ఇదే..
ఈ రెండు పరీక్షలు రాసే వారిలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు అధికంగా ఉన్నారని తెలిపారు. కాబట్టి, ఏయూ నిర్వహించే పరీక్షల నిర్వహణకు ముందే ప్రకటించిన ఈ నెల 30, 31 తేదీలను మార్పు చేయాలని ఎమ్మెల్సీ విజ్ఞిప్తి చేశారు. అయితే యునివర్శిటీ వీసీ రాజీనామా కారణంగా ఇంత వరకూ ఏ నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్సీ అభిప్రాయపడ్డారు. కొత్తగా ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు తీసుకున్న శశిభూషణరావుతో ఎమ్మెల్సీ ఐవీ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడి పరీక్షల తేదీల మార్పు ఆవశ్యకతను వివరించారు. తేదీల మార్పుపై తగు నిర్ణయం తీసుకుంటానని తనకు ఇన్‌చార్జి వీసీ తనకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ ఐవీ పేర్కొన్నారు.