B.Ed Exams 2024: రేపటి నుంచి బీఈడీ పరీక్షలు..

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు బీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

వర్సిటీ వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ బి. సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 15 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 

AP SSC Supplementary Exam Hall Tickets Download: ఏపీ టెన్త్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ హాల్‌టికెట్స్‌ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి.

బీఈడీ 3వ సెమిస్టర్‌ పరీక్షలకు రెగ్యులర్‌ 3012 మంది, సప్లిమెంటరీకి 568, బీపీఈడీ మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌ 104, సప్లిమెంటరీకి 19, 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ 71, సప్లిమెంటరీకి 36, ఎంపీఈడీ మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌ 84, సప్లిమెంటరీకి 16, 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ 122, సప్లిమెంటరీకి 16 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు.

 

 

#Tags