Application Date Extended : డీఎస్సీ ఉచిత శిక్షణకు పొడగించిన దరఖాస్తుల గడువు!
ఎంవీపీ కాలనీ(విశాఖ): డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ రామారావు తెలిపారు. డీఎస్సీకి సిద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ ఉచిత శిక్షణ అందిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ప్రకటించిన దరఖాస్తు గడువు 21వ తేదీతో ముగియడంతో ఈ నెల 25 వరకు మరోసారి పొడిగించారు.
APAAR Card : విద్యార్థులకు ఆధార్ తరహాలో అపార్ కార్డు
దరఖాస్తు గడువు ముగిసిన అనంతరం అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు రామారావు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒకేరోజు ఈ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారని తెలిపారు. అభ్యర్థులు వారి ఆసక్తికి అనుగుణంగా వివిధ జిల్లాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. విశాఖ జిల్లాలో 100 మంది వరకు శిక్షణ కోసం ఎంపిక చేస్తామన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)