Degree Admissions: 'దోస్త్‌'తో డిగ్రీ ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు..

ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్త్‌ వెబ్‌సైట్‌ ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి..

నిజామాబాద్‌: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) తొలివిడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 29న ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరు యూనివర్సిటీల (ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన)తో పాటు మహిళా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు పరిధిలోని కళాశాలల్లో బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, డీఫార్మసీ కోర్సుల్లో ఫస్టియర్‌ ప్రవేశాలను దోస్త్‌ ద్వారా నిర్వహిస్తారు. ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్త్‌ వెబ్‌సైట్‌ https://dost.cgg.gov.in లో రూ.200 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇంటర్‌ మార్కుల ఆధారంగా ఆయా కాలేజీల్లో డిగ్రీ ఫస్టియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.

ITI Admissions: ప్ర‌భుత్వ‌, ప్ర‌వైటు ఐటీఐ క‌ళాశాల‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

టీయూ పరిధిలో..

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 74 డిగ్రీ కళాశాలల్లో సుమారు 33,630 సీట్లు అందుబాటులో ఉన్నాయి. టీయూ పరిధిలోని 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 7,500 సీట్లు, 54 ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 24,290 సీట్లు, ఏడు సాంఘిక, గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలల్లో 1,840 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ సారి వర్సిటీ పరిధిలో కొన్ని అదనపు డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా బీకాం ఫైనాన్స్‌, బీఎస్సీ బయోమెడికల్‌ సైన్స్‌, బీఏ హానర్స్‌, బీఏ పబ్లిక్‌ పాలసీ లాంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.

మొదటి విడత

ఈ నెల 6 నుంచి తొలివిడత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 29 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 20వ తేది నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలి. దివ్యాంగులు, ఇతర ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్న వారికి ఈ నెల 28, 29వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. తొలివిడత సీటు అలాట్‌మెంట్‌ జూన్‌ 6న ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు జూన్‌ 7 నుంచి 12లోగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ పూర్తి చేయాలి.

Gurukul Students in EAPCET: ఈఏపీ సెట్‌లో ఉత్త‌మ ర్యాంకులు సాధించిన బాలుర‌ గురుకుల విద్యార్థులు..

రెండో విడత

జూన్‌ 6 నుంచి రెండో విడత రిజిస్ట్రేషన్‌ ప్రారంభమవుతుంది. విద్యార్థులు రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి జూన్‌ 13 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. జూన్‌ 6 నుంచి 14 వరకు వెబ్‌ఆప్షన్స్‌ ఇవ్వాలి. దివ్యాంగులు, ఇతర ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్న వారికి జూన్‌ 13న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. రెండో విడత సీట్ల కేటాయింపు జూన్‌ 18న ఉంటుంది. సీట్లు పొందిన వారు జూన్‌ 19నుంచి 24లోగా ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్‌ చేయాలి.

ITI Admissions: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి

మూడో విడత

జూన్‌ 19 నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. విద్యార్థులు రూ.400 ఫీజు చెల్లించి జూన్‌ 25 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అలాగే జూన్‌ 19 నుంచి 26 వరకు కాలేజీల వెబ్‌ఆప్షన్స్‌ ఇవ్వాలి. దివ్యాంగులు, ఇతర ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్న వారికి జూన్‌ 25న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. మూడో విడత సీట్ల కేటాయింపు జూన్‌ 29న ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు జూన్‌ 29 నుంచి జూలై 3 లోగా రిపోర్టింగ్‌ చేయాలి. విద్యార్థులకు జూలై 1 నుంచి 6వరకు ఓరియెంటేషన్‌ తరగతులుంటాయి. ఫస్టియర్‌ సెమిస్టర్‌ తరగతులు జూలై 8 నుంచి ప్రారంభమవుతాయి.

AP EAPCET: ప్ర‌శాంతంగా ఏపీ ఈఏపీసెట్ ప‌రీక్ష‌..

#Tags