Admissions in Sports School: స్పోర్ట్స్‌ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి

రంపచోడవరం: గిరిజన సంక్షేమ శాఖ గురుకులం సెల్‌ తాడేపల్లి ఆదేశాల ప్రకారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ముసురుమిల్లి స్పోర్ట్స్‌ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు డీడీ తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా నుంచి ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 7, 8 తేదీల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ఆశ్రమ, గురుకుల పాఠశాలలో చదివిన వారు ఆరో తరగతి స్పోర్ట్స్‌ స్కూల్‌లో ప్రవేశానికి అర్హులన్నారు. అలాగే 7,8,9 తరగతుల్లో స్పోర్ట్స్‌ స్కూలులో ప్రవేశానికి బ్యాక్‌లాగ్‌ ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఐదో తరగతి 30 సీట్లు, ఏడవ తరగతి 30 సీట్లు, ఎనిమిదో తరగతి 30, తొమ్మిదో తరగతి 25 మొత్తం 125 సీట్లు ఉన్నట్లు తెలిపారు.

 

Admissions in Andhra University: డిప్లమో, పీజీ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలు

#Tags