Admissions in Andhra University: డిప్లమో, పీజీ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలు
ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీజీ డిప్లమో, డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రవేశాల సంచాలకుడుచార్య డి.ఎ.నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తులను తమ కార్యాలంలో అందజేయాలన్నారు. దరఖాస్తులను ఏయూ వెబ్‌సైట్ (http://www.audoa.in/) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పీజీ డిప్లమో విభాగంలో సాయంత్రం నిర్వహించే యోగా, డిప్లమో కోర్సుల విభాగంలో ఏడాది కాల వ్యవధితో నిర్వహించే సాయంకాలం కోర్సులు లలిత సంగీతం, ఆధ్యాత్మిక సంగీతం, కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీతం, మృదంగం, ఘటం, కంజీర, ఆరు నెలల కాలవ్యవధితో నిర్వహించే యోగా, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, ఫొటోగ్రఫీ, సాఫ్ట్‌స్కిల్స్, కొరియన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పీజీ డిప్లమో కోర్సులకు ఈ నెల 19న ఉదయం 10 గంటల నుంచి, డిప్లమో కోర్సులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. కోర్సుల వారీగా అర్హతలు, ఫీజు వివరాలు తదితర పూర్తి వివరాల కోసం ఏయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.