APSCHE : సెప్టెంబర్‌ 3 నుంచి ఏపీ పీజీ సెట్‌.. హాల్‌టికెట్ల విడుదల తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేషన్‌ : ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి, యోగి వేమన విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–2022 షెడ్యూల్‌ను సెట్‌ కనీ్వనర్‌ ఆచార్య వై.నజీర్‌ అహ్మద్‌ ఆగస్టు 22వ తేదీన(సోమవారం) ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సబ్జెక్టుల వారీగా సెప్టెంబర్‌ 3 నుంచి 11 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 18తో ముగిసిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 147 సబ్జెక్టులకు 39,359 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని చెప్పారు. ఇందులో అత్యధికంగా కెమికల్‌ సైన్స్‌కు 9,899 దరఖాస్తులు, లైఫ్‌ సైన్స్‌కు 5,960 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. సెప్టెంబర్‌ 3, 4, 7, 10, 11 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 వరకు రెండో సెషన్, సాయంత్రం 4.30 నుంచి 6 వరకు మూడో సెషన్‌ నిర్వహిస్తామని వివరించారు. అభ్యర్థులు ఆగస్టు 25 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. సంస్కృతం, ఉర్దూ, తమిళం, ఫోక్‌లోర్, బీఎఫ్‌ఏ, పెర్ఫారి్మంగ్‌ ఆర్ట్స్‌ అండ్‌ మ్యూజిక్, పెర్ఫారి్మంగ్‌ ఆర్ట్స్, టూరిజం, జియోగ్రఫీ సబ్జెక్టులకు దరఖాస్తులు తక్కువగా రావడంతో వాటికి పరీక్ష నిర్వహించడం లేదని చెప్పారు. డిగ్రీలో వచి్చన మార్కుల ఆధారంగా ఆ కోర్సులకు సీట్లను కేటాయిస్తామని తెలిపారు.

#Tags