Best Education and Jobs For AP Students : విద్య, ఉపాధిలో ఏపీ దేశంలోనే టాప్‌.. 1.25 లక్షల మంది యువతకు పైసా ఖర్చు లేకుండానే.. మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : విద్య, ఉద్యోగాలు కల్పించడంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం దేశంలోనే టాప్‌లో ఉంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల మంచి భ‌విష్య‌త్ కోసం ఈ నాలుగైదు ఏళ్ల‌లోనే రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకోచ్చారు.

☛ AP CM YS Jagan Mohan Reddy : చ‌రిత్ర‌లో ఎన్న‌డులేని విధంగా.. ఏపీ విద్యారంగంలో చేసిన విప్లవాత్మక మార్పులు ఇవే..

ఫ‌లించిన ఫ‌లితాలు ఇలా..

☛ డిగ్రీ విద్య పూర్తి చేసుకున్న పట్టభద్రులకు ఉద్యోగాలు వ‌స్తున్నాయి. 
☛ విద్యార్థుల్లో నైపుణ్యాలు, సామర్ధ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా
సీఎం వైఎస్ జగన్ పట్టిష్టమైన చర్యలు తీసుకున్నారు. 
☛  ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో.. ప్రస్తుతం పరిశ్రమలే విద్యార్థుల కోసం వస్తున్నాయి. 
☛ రాష్ట్రంలో 1.25 లక్షల మంది యువతకు పైసా ఖర్చు లేకుండా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సు అందిస్తున్నారు.
☛ నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్షిప్, ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తున్నది.
☛ పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తిలో దేశంలోనే ఏపీ నెంబర్ ఒన్‌గా ఉన్న‌ది.☛ 2017తో పోల్చితే 2021లో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఎలిమెంటరీ స్థాయిలో భారీ పెరుగుదల.. టాప్ నాలుగు రాష్ట్రాల్లో ఏపీకి తొలి స్థానం. ఆ తరువాత ఉత్తరాఖండ్, పంజాబ్, యూపీ.

☛ జాతీయ స్థాయిని మించి ఏపీలో స్థూల నమోదు నిష్పత్తి పెరుగదల.
☛ ఏపీలో 2021లో ప్రైమరీలో 18.4, అప్పర్ ప్రైమరీలో 13.4, ఎలిమెంటరీలో 16.5 శాతం పెరుగుదల. ఛత్తీస్ ఘఢ్, గోవా, జార్ఖండ్, బీహార్లో స్థూల నమోదు తగ్గుదల
☛ బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉండాలనే ప్రభుత్వ చర్యలు ఫలితంగా పాఠ‌శాల్లో హాజ‌రుశాతం భారీగా న‌మోదు.
☛ అమ్మ ఒడితో పేదల పిల్లలందరూ స్కూళ్లలో చేరేలా ప్రోత్సాహం
☛ ఉన్నత విద్యలో విద్యార్థి కేంద్రంగా భారీగా సంస్కరణలు.. గత 23 ఏళ్లలో ఆధునికంగా మారిపోయిన ప్రపంచం
☛  ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలో వెల్లడి

#Tags