Annual Day Celebrations: ఉద్యాన కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు..
వార్షికోత్సవ వేడుకలో భాగంగా కళాశాల ఉపకులపతి విద్యార్థులను ప్రోత్సాహిస్తూ మాట్లాడారు..
తాడేపల్లిగూడెం: విద్యార్థులకు నైతిక విలువలు అవసరం అని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి టి.జానకీరామ్ అన్నారు. వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన కళాశాల 18వ వార్షికోత్సవం గురువారం రాత్రి జరిగింది. వీసీ మాట్లాడుతూ విద్యార్ధులు మానసిక ఉల్లాసం కోసం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలన్నారు.
Free Coaching for Civils: సివిల్స్ సర్వీసెస్ కోసం ఉచిత శిక్షణ.. దరఖాస్తులకు తేదీ..
ఈ సందర్బంగా యూట్యూబ్‌లో వర్చువల్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించారు. కళాశాల మ్యాగజైన్ సౌగంధిని ఆవిష్కరించారు. ప్రతిభ చూపిన విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. వర్సిటీ అధికారులు పద్మావతమ్మ, సలోమి, మాధవి, తదితరులు పాల్గొన్నారు.
Post Office Jobs: రాత పరీక్ష లేకుండానే..పదో తరగతి ఉత్తీర్ణతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
#Tags