Degree Semester Results : ఆంధ్రకేస‌రి యూనివ‌ర్సిటీ డిగ్రీ రెండో సెమిస్ట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌.. ఉత్తీర్ణ‌త శాతం ఇలా..

ఏప్రిల్‌ 22 నుంచి 29 వరకు నిర్వహించిన రెండో సెమిస్టర్‌ పరీక్షలకు ఫలితాలను శనివారం వీసీ డీవీఆర్‌ మూర్తి విడుదల చేశారు..

ఒంగోలు: ఆంధ్రకేసరి యూనివర్శిటీ డిగ్రీ రెండో సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను శనివారం వీసీ డీవీఆర్‌ మూర్తి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్శిటీ పరిధిలోని 88 డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఏప్రిల్‌ 22 నుంచి 29 వరకు నిర్వహించిన రెండో సెమిస్టర్‌ పరీక్షలకు 7224 మంది పరీక్ష ఫీజు చెల్లించారని, కానీ అందులో 6377 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారన్నారు. వీరిలో 2966 మంది (46.51 శాతం) ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.

Learning Skills: అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి

బీఏ హానర్స్‌ విభాగంలో 355 మందికి 208 మంది, బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో 2359 మందికి 1008 మంది, బీకాం జనరల్‌ విభాగంలో 89 మందికి 32 మంది, బీకాం ఒకేషనల్‌ విభాగంలో 33 మందికి 22 మంది, బీఎస్‌సీ హానర్స్‌ విభాగంలో 2636 మందికి 1275 మంది, బీఎస్‌సీ హానర్స్‌ విభాగంలో 2636 మందికి 1275 మంది, బీబీఏ విభాగంలో 66 మందికి 29 మంది, బీసీఏ విభాగంలో 839 మందికి 392 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. విద్యార్థులు భవిష్యత్‌లో ఇంకా మంచి ఫలితాలను సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు.

Amma Adarsh ​​Schools: బడి పరిశుభ్రత బాధ్యత ‘అమ్మ’కే..!

ఫలితాలను యూనివర్శిటీ లింకు ద్వారా తెలుసుకోవచ్చని పరీక్షల అదనపు నియంత్రణ అధికారి డాక్టర్‌ బి.పద్మజ తెలిపారు. కార్యక్రమంలో సీఈ డాక్టర్‌ కేవీఎన్‌ రాజు, ఏసీఈ డాక్టర్‌ బి.పద్మజ, పరీక్షల విభాగం పర్యవేక్షకులు శివరామయ్యతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. రెండో సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు వీసీ ప్రొఫెసర్‌ డీవీఆర్‌ మూర్తి, ఏసీఈ డాక్టర్‌ బి.పద్మజ అభినందనలు తెలిపారు.

Fortune Global 500: భారత్‌, ప్రపంచంలో అత్యుత్తమ ర్యాంకు పొందిన కంపెనీలు ఇవే..

#Tags