Private Schools Admissions : ఉచిత విద్యకు మొద‌టి విడ‌తలో అడ్మిష‌న్‌ పొందిన విద్యార్థులు..!

యడ్లపాడు: జిల్లాలో ఐబీ, ఐసీఎస్సీ, సీబీఎస్సీ, స్టేట్‌ సిలబస్‌ బోధన చేస్తూ విద్యాశాఖ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు విధిగా తమ స్కూళ్లలో ఒకటో తరగతి ప్రవేశాలకు 25 శాతం ఉచిత సీట్లను కేటాయించాలి. ఇందులో భాగంగా పల్నాడు జిల్లాలో విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 12(1)(సి) ద్వారా విద్యాశాఖ గతేడాది 259 మంది విద్యార్థులకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించింది.

Entrance Exam for Gurukul Admissions : 27న బాలిక‌ల గురుకుల ప్ర‌వేశానికి ప‌రీక్ష‌.. ఈ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కే

2024–25 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 1000 మంది తల్లిదండ్రులు ఉచిత విద్యకు దరఖాస్తులు చేసుకున్నారు. వీటిని పరిశీలించి అర్హత కలిగిన వారిని 568 దరఖాస్తుల్ని గుర్తించారు. వాటిలో మొదటి విడతగా 521మంది విద్యార్థుల్ని ఎంపిక చేశారు. వీరిలో 436 మంది అడ్మిషన్లు పొందారు. రెండో విడతగా 47 మందికి ఉచిత సీట్లను కేటాయించగా వీటిలో 26 మంది చేరారు. జిల్లాలో మొత్తం 465 మంది విద్యార్థులు ఉచిత విద్యాహక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోగా, మరో 103 మంది ఇంకా పాఠశాలల్లో చేరాల్సి ఉంది.

No Notification : డిగ్రీ ప్ర‌వేశాలకు విడుద‌ల కాని నోటిఫికేష‌న్‌.. ఇది విద్యార్థుల ప‌రిస్థితి..

#Tags