Gurukul Admissions: ఈ నెల 31లోగా గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.

గురుకుల పాఠశాల, కళాశాలలో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు ప్రిన్సిపాల్‌ డీఎస్‌బీ శంకరరావు. అయితే, ప్రకటించిన వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకొని, త్వరలో నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలు స్పష్టంగా మీకోసం..

ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాలల ఏలూరు జిల్లా కన్వీనర్‌, అప్పలరాజుగూడెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ డీఎస్‌బీ శంకరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో 50 పాఠశాలలు, 10 జూనియర్‌ కళాశాలలు, ఒక డిగ్రీ కళాశాల (సాధారణ, మైనారిటీ) మొత్తం 61 విద్యాలయాలు ఉన్నాయన్నారు.

TS Tenth Exams: పదో తరగతి పరీక్ష కేంద్రాల తనిఖీ..

ఈ పాఠశాల, కళాశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఏప్రిల్‌ 25న పాఠశాల విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, కళాశాల విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కేంద్రంలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 31వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో https//:aprs.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా పాఠశాల విద్యార్థులు రూ.100, కళాశాల విద్యార్థులు రూ.300 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

AP Intermediate Exams: ఇంటర్‌ వార్షిక పరీక్షకు హుజరైన విద్యార్థుల సంఖ్య.. ఈసారి మాల్‌ప్రాక్టీస్‌ కేసులు ఎంత..?

5వ తరగతి విద్యార్థులు 2022–23, 2023–24 సంవత్సరాల్లో గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3, 4 తరగతులు చదివి ఉండాలన్నారు. అలాగే 6, 7, 8 తరగతులకు సంబంధించి మిగిలిన సీట్లకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 2023–24 విద్యాసంవత్సరంలో నాలుగో తరగతి చదుతున్న గ్రామీణ ప్రాంతాల ఓసీ, బీసీ విద్యార్థులు, అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు.

National Level Wrestling: జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీలకు ఈ విద్యార్థిని ఎంపిక..

దరఖాస్తులను ఈ నెల 31లోగా ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు. ప్రవేశ పరీక్ష అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్‌ 25న నిర్వహిస్తామన్నారు. సంబంధిత ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా వివిధ కేటగిరీల్లో నిర్దేశించిన రిజర్వేషన్‌ ప్రకారం ప్రవేశం కల్పిస్తామన్నారు. ఇతర వివరాలకు 871262 5030, 87126 25031 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు.

AP POLYCET 2024: పాలిసెట్‌-2024 పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం.. తేదీ..?

#Tags