Admissions in AP Model Schools: ఏపీ మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రతి నిరుపేద విద్యార్థి ఉన్నత చదువులు అభ్యసించాలనే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేశారు..

అవి నేడు కార్పొరేట్‌ విద్యకు పట్టుగొమ్మలుగా అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు–నేడు పథకంతో ఆ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో పాటు విద్యాబోధన అందుతోంది.

దరఖాస్తు ఇలా..
సీబీఎస్‌ఈకి అనుబంధంగా ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు ఈ నెల 1వ తేదీన నోటిఫికేషన్‌న్‌ విడుదలైంది. ఈ నెల 31వతేదీని దరఖాస్తుకు చివరి గడువుగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌న్‌ ద్వారా అందజేసిన దరఖాస్తుకు సంబంధించి జిరాక్స్‌ కాపీ, ఆధార్‌ కార్డు, ఫొటోను సదరు పాఠశాలలో అందజేయాలి. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న బాలబాలికలు అడ్మిషన్‌కు అర్హులు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75 చలానా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న మోడల్‌ స్కూళ్లలోనే ఏప్రిల్‌ 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఫలితాలను ఏప్రిల్‌ 27వ తేదీన వెల్లడించనున్నారు. 30న సర్టిఫికెట్ల వెరిఫికేషనన్‌ , కౌన్సెలింగ్‌ ఉంటుంది. జూన్‌న్‌ 12వ తేదీ నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.

విద్యాబోధన ఇలా..
జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏపీ మోడల్‌ స్కూళ్లల్లో ఆంగ్లంలో విద్యాబోధన ఉంటుంది. దీంతో ఏటా ఆ పాఠశాలల్లో విద్యార్థులు పెరుగుతూ వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించి విద్యార్థులకు 6వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఒక్కసారి 6వ తరగతిలో చేరితే... ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తి అయ్యేవరకూ అక్కడే విద్యాభ్యాసం చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రతి తరగతిలోనూ 80 మందికి అవకాశం ఉంటుంది. ఇంటర్‌లో ఒక్కో గ్రూపులో 20 మంది చొప్పున విద్యార్థులు ఉంటారు. నాణ్యమైన యూనిఫామ్‌, టై, బెల్టు, షూ, పుస్తకాలు, ట్యాబ్‌లు, మధ్యాహ్న భోజనం, లైబ్ర రీ, విశాలమైన ఆటస్థలం ఇతర వసతులు ఉంటాయి. సీబీఎస్‌ఈ సిలబస్‌, టోఫెల్‌, లిప్‌ తదితర కార్యక్రమాలను అమలు చేస్తుండడంతో ఇక్కడి విద్యార్థులు పోటీ ప్రపంచంలో ధీటుగా రాణిస్తున్నారు.

ప్రతి పాఠశాలలో 100 అడ్మిషన్లు
జిల్లా వ్యాప్తంగా 7 ఏపీ మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి . రొంపిచెర్ల, బైరెడ్డిపల్లె, గుడుపల్లె, శాంతిపురం, కుప్పం, రామకుప్పం, పుంగనూరు మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ సాగుతోంది. ఒక్కో పాఠశాలలో ఆరో తరగతికి గతంలో 80 సీట్లు మాత్రమే కేటాయించే వారు. విద్యార్థుల తల్లిదండ్రుల విన్నపం మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వంద సీట్లకు పెంచింది. ఈ లెక్కన 25 పాఠశాలల్లో 2,,500 మంది విద్యార్థులకు ప్రవేశాలు దక్కనున్నాయి. ఒక్కో సీటుకు ఐదు నుంచి పది మంది విద్యార్థులు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఆదర్శ పాఠశాల లేని మండలాల్లోని విద్యార్థులు సమీప మండలాల మోడల్‌ స్కూళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత మండల విద్యార్థులు లేని పక్షంలో మాత్రమే పక్క మండలాల విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. బాలికల కోసం ప్రత్యేకంగా హాస్టల్‌ సౌకర్యం ఉంది.

ఇంటర్‌ వరకు ఉచితం
పేద విద్యార్థులకు ఏపీ మోడల్‌ స్కూల్‌ వరం లాంటింది. కార్పొరేట్‌ విద్యను పేద విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం ఈ ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసింది. నూతన భవనాలు, విశాలమైన తరగతి గదులు, మెరుగైన సౌకర్యాలు ఉండడంతో మోడల్‌ స్కూళ్లకు ఆదరణ పెరిగింది. ఇక్కడ ఒక్కసారి సీటు దక్కితే ఇంటర్‌ పూర్తయ్యే వరకూ చక్కగా చదువుకోవచ్చు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. – దేవరాజు, డీఈఓ, చిత్తూరు
 

#Tags