Navodaya Admission 2024: నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలు.. చివరి తేదీ ఇదే
తిరుపతి ఎడ్యుకేషన్ : నవోదయ విద్యాలయాల్లో 2025–26వ విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ వెలువడింది. ఆ మేరకు తిరుపతిలోని విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రం అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జవహర్ నవోదయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా 653, ఇందులో మన రాష్ట్రంలో 15, తెలంగాణలో 9 ఉన్నాయన్నారు. ఈ విద్యాలయాల్లో అత్యున్నత ప్రమాణాలతో సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఉచిత విద్య, అలాగే ఉచిత వసతి, భోజనం సౌకర్యాలు కల్పిస్తారని తెలిపారు. రెగ్యులర్ చదువుతో పాటు నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తారన్నారు.
Telangana DSC 2024 Exams: నేటి నుంచి తెలంగాణ డీఎస్సీ పరీక్షలు..
ఏటా ఒక్కో నవోదయ విద్యాలయంలో 80మందికి ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారని పేర్కొన్నారు. 2025, జనవరి 18వ తేదీన జాతీయ స్థాయిలో నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్టు(జేఎన్‌వీఎస్‌టీ)కు ఈ ఏడాది 5వ తరగతి చదివే విద్యార్థులు అర్హులని, దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబరు 16వ తేదీ ఆఖరు అని తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలకు 86888 88802, 93999 76999నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
Tags
- Navodaya Admissions
- navodaya admission 2024
- navodaya admission 2024 news
- navodaya admission 2024 apply last date
- 2024 Jawahar Navodaya Vidyalaya admission
- jawahar navodaya vidyalaya 6th class admission 2025-26
- JNV 6th class admission 2025-26
- JNV 6th class admission 2025-26 News in Telugu
- jnv 6th class admission application form
- jnv 6th class admission online apply last date 2025
- Navodaya Vidyalaya Samiti XI 2025-26 Admissions
- Navodaya Vidyalaya Samiti XI 2025-26 Admissions News in Telugu
- Navodaya Vidyalaya Samiti 2025-26
- JNVST 2025 Important Dates
- Jawahar Navodaya Vidyalaya Admission
- jnv 6th class 2025 apply last on september 16th
- jnv 6th class 2025 apply last on september 16th news telugu