Skip to main content

Navodaya Entrance Exam : నేడు న‌వోద‌య ప్ర‌వేశ ప‌రీక్ష‌.. పెద్ద సంఖ్య‌లో విద్యార్థులు..

Students attends navodaya vidhyalaya entrance exam

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యార్థులు ఎంతోమంది న‌వోద‌య‌లో ప్ర‌వేశం పొందేందుకు ఆస‌క్తి చూపిస్తారు. ఆస‌క్తి ఉన్న విద్యార్థుల‌కు కూసుమంచి మండలం పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల్లో ఖాళీలు ఉండ‌గా, వాటిని భర్తీ చేసేందుకు శనివారం అంటే, ఫిబ్ర‌వ‌రి 8వ తేదీన‌ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ప్ర‌క్రియ‌లో పాల్గొనేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరై ప‌రీక్ష రాశారు. ఇక ఫ‌లితాల్లో ఉన్న‌త మార్కులు సాధించిన విద్యార్థులకు ప్ర‌వేశం ద‌క్కుతుంది.

241 Vacancies at Supreme Court : 35,400 జీతంతో సుప్రీం కోర్టులో ఉద్యోగం.. ద‌ర‌ఖాస్తుల వివ‌రాలు ఇవే..

పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంతో పాటు, కూసుమంచిలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఈ పరీక్షలో నిర్వహిస్తున్నారు. విద్యాలయ ప్రధానాచార్యులు ఏ. నరసింహులు పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులైతే పెద్ద సంఖ్య‌లోనే ప‌రీక్ష‌కు హాజ‌రైయ్యారు. ఈ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధిస్తే, న‌వోద‌యలో 9, 11వ త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశానికి అర్హ‌త సాధించి, అక్క‌డి విద్య‌ను పొందుతారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 08 Feb 2025 05:45PM

Photo Stories