Admission Test: 6వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష.. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ఇలా..
తుమ్మపాల: ఈ నెల 21 ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 5 మోడల్ స్కూళ్లలో నిర్వహించే పరీక్షకు విద్యార్థులు నిర్దేశిత సమయానికి గంట ముందుగా పరీక్ష కేంద్రానికి హాజరుకావాలన్నారు.
Flagship Exams: యూపీఎస్‌సీ ఆధ్వర్యంలో ఫ్లగ్‌షిప్ పరీక్షలు.. షెడ్యూల్ ఇలా..!
విద్యార్థులు www.cse.ap.gov.in/apms.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా హల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. పరీక్షకు సంబంధించి ఉపాధ్యాయుల సూచనలను ముందుగానే విద్యార్థులు తీసుకోవాలని తెలిపారు. బ్లూ, బ్లాక్ బాల్‌పెన్‌తో మాత్రమే సమాధానాలు పూరించాలన్నారు. హల్ టికెట్‌పై ఫొటో లేకపోతే సంబంధిత పాఠశాల హెచ్‌ఎం నుంచి రెండు ఫొటోలను అటెస్టేషన్ చేసి తీసుకురావాలన్నారు. మరింత సమాచారం కోసం సమీపంలోనే ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలని సూచించారు.
M. Tech Results: ఎంటెక్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..