Tenth Exam by Senior: పదో తరగతి పరీక్షలు రాస్తున్న సీనియర్లు..

చదువుకు వయసుతో పనిలేదు అంటే ఇదే. కొన్ని రోజుల క్రితం తమ కొడుకుతోపాటు తల్లి కూడా పరీక్ష రాసేందుకు వచ్చింది. మరోసారి ఇప్పుడు మరొకరు ఇలాగే పరీక్ష రాసేందుకు కేంద్రానికి వచ్చారు. వారి గురించి తెలుసుకుందాం..

యశవంతపుర: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతుండగా అక్కడక్కడ కొన్ని వింతలు జరుగుతున్నాయి. గదగ్‌లో కొడుకుతో పాటు తల్లి కూడా ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు రాసింది. ఇదే రీతిలో దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా సంతేబెన్నూరుకు చెందిన సిద్ధలింగప్ప (52) పది పరీక్షలను రాస్తున్నారు. కర్ణాటక పబ్లిక్‌ స్కూల్‌ కేంద్రంలో తన మనవళ్ల వయస్సున్న బాలలతో కలిసి గురువారం పరీక్ష రాశారు.

Hanmajipalle Primary School: టైంకు వస్తలేరు.. చదువు చెప్తలేరు

సిద్ధలింగప్ప రాగానే ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆశ్చర్యపోయారు. ఆయన దివ్యాంగుడు కాగా, అప్పట్లో పేదరికం వల్ల చదవలేకపోయాడు. ప్రత్యేక కోటా కింద రేషన్‌ డిపో తెచ్చుకోవడానికి కనీసం పదో తరగతి పాసై ఉండాలి. ఇందుకోసం పరీక్ష రాస్తున్నట్లు చెప్పాడు. మరోవైపు రాష్ట్రమంతటా పరీక్షలు సజావుగా సాగాయి. ఎన్నికల కోలాహలం, తీవ్రమైన ఎండలు పిల్లల ఏకాగ్రతకు ఆటంకంగా మారాయి.

IIMV-CRME: ఐఐఎం విశాఖలో సీఆర్‌ఎంఈ ప్రారంభం

#Tags