Acharya Nagarjuna University: Law కాలేజీ విద్యార్థినికి మూడు బంగారు పతకాలు
ఒంగోలు: ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతులమీదుగా ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీ విద్యార్థిని ఎం.రోజా మంగళవారం మూడు బంగారు పతకాలను అందుకున్నారు.
2014–17 బ్యాచ్‌కు చెందిన విద్యార్థిని రోజా అత్యధిక టోటల్ మార్కుల సాధనలో, విద్యార్థినుల్లో అత్యధిక మార్కులు పొందడం, ప్రత్యేక సబ్జక్టులలో అత్యధిక మార్కులను కై వసం చేసుకోవడం అనే మూడు అంశాల్లో మూడు బంగారు పతకాలను ఆచార్య నాగార్జున యూనివర్శిటీ స్నాతకోత్సవంలో అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఒంగోలు ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం అభినందించారు.
a
#Tags