Distance Education: దూర విద్యలో ఇగ్నో ఆధునిక కోర్సులు.. దేశ వ్యాప్తంగా స్థానం ఇది!

యూనివర్సిటీలో ఆదివారం నిర్వహించిన ఇండక్షన్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రాంతీయ కేంద్ర ఉప సంచాలకులు సుమలత మాట్లాడారు..

గుంటూరు: దూర విద్యా విధానంలో ఇగ్నో ఆధునిక కోర్సులు ప్రవేశ పెట్టిందని ప్రాంతీయ కేంద్ర ఉప సంచాలకులు కె.సుమలత తెలిపారు. ఆదివారం పట్టాభిపురంలోని టీజేపీఎస్‌ కళాశాల ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయ (ఇగ్నో) అధ్యయన కేంద్రంలో నూతన విద్యా కోర్సులపై ఇండక్షన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సుమలత మాట్లాడుతూ టీజేపీఎస్‌ కళాశాలలో 1987 నుంచి అధ్యయన కేంద్రం కొనసాగుతోందన్నారు. దేశ వ్యాప్తంగా 500 కేంద్రాలు, 58 కోర్సులతో దూర విద్యా విధానంలో ఇగ్నో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు.

AP 10th Class Supplementary Exam Dates: టెన్త్‌ ఫలితాల్లో ఫెయిలైన వారికి మరో ఛాన్స్‌.. సప్లిమెంటరీ పరీక్షల తేదీలు విడుదల

విద్యార్థుల ప్రయోజనార్ధం విజయవాడలోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేసిన యూట్యూబ్‌ ఛానల్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇగ్నో కోర్సుల్లో ప్రవేశాలు, ఫీజుల చెల్లింపు, పేపర్ల ఎంపిక, అధ్యయన కేంద్ర సమయాలు, కౌన్సిలర్ల పాత్రపై అధ్యయన కేంద్ర సమన్వయకర్త ఏ. భాను మురళీధర్‌ వివరించారు. కార్యక్రమంలో ఇగ్నో సీనియర్‌ కౌన్సిలర్‌ బీవీహెచ్‌కే కామేశ్వరశాస్త్రి, ఎంఎస్‌ నారాయణ, డాక్టర్‌ కె. కొండయ్య,కళాశాల ప్రిన్సిపాల్‌ ఏబీపీ మనోహర్‌, కరస్పాండెంట్‌ కేవీ బ్రహ్మం, అధ్యాపకులు డాక్టర్‌ పి.దేవేంద్రగుప్తా, పి.నాగమణి, విద్యార్థులు పాల్గొన్నారు.

Flagship Exam: సాఫీగా సాగిన ఫ్లాగ్‌షిప్‌ పరీక్షలు.. ఈ రెండు కేంద్రాల్లో హాజరు ఇలా!

#Tags