Flagship Exam: సాఫీగా సాగిన ఫ్లాగ్‌షిప్ పరీక్షలు.. ఈ రెండు కేంద్రాల్లో హాజరు ఇలా!
అనంతపురం అర్బన్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఫ్లాగ్‌షిప్ పరీక్షలు సజావుగా జరిగాయి. సీడీఏ పరీక్షకు అభ్యర్థుల హాజరు 40.6 శాతం నమోదైంది. ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్షకు అభ్యర్థుల హాజరు 66 శాతం నమోదైంది. సీడీఏ పరీక్షకు హెచ్‌ఎల్‌సీ ఎస్‌ఈ ఎన్.రాజశేఖర్ స్థానిక తనిఖీ అధికారిగా వ్యవహరించారు. ఎన్‌డీఏ,ఎన్‌ఏ పరీక్షకు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎ.కళ్యాణి స్థానిక తనిఖీ అధికారిగా వ్యహరించారు.
AP 10th Class Results Live Updates: పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి.. ఈసారి రికార్డు స్థాయిలో..
హాజరు ఇలా...
జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంగా నిర్వహించిన కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ (సీడీఏ) పరీక్షకు 136 మంది అభ్యర్థులకు గానూ ఉదయం పేపర్–1కు 54 మంది (39.70 శాతం) అభ్యర్థులు, మధ్యాహ్నం జరిగిన పేపర్–2కు 54 మంది (39.70 శాతం) హాజరయ్యారు. ఇక పేపర్–3కి 66 మంది అభ్యర్థులకు గానూ 28 మంది(42.4శాతం) హాజరయ్యారు.
UPSC topper యూపీఎస్సీ టాపర్‌పై 'ఆనంద్ మహీంద్రా' ప్రశంసల జల్లు.. ఎమన్నారంటే..!
● కేఎస్‌ఎన్ కళాశాల కేంద్రంగా జరిగిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ పరీక్షకు 187 మంది అభ్యర్థులకు గానూ ఉదయం జరిగిన పేపర్–1 పరీక్షకు 123 మంది (65.78 శాతం) అభ్యర్థులు, పేపర్–2 పరీక్షకు 124 మంది (66.31 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తంగా ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్షకు 66 శాతం అభ్యర్థులు హాజరయ్యారు.
UGC NET 2024 Notification: యూజీసీ నెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. జూన్ 16న దేశ వ్యాప్తంగా పరీక్ష