Open School: ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదివినా సర్టిఫికెట్లకు రెగ్యులర్‌గా పరిగణిస్తారు: విద్యాశాఖాధికారి కె.శామ్యూల్‌

నరసరావుపేట: చదువుకు దూరమైన వారికి ఓపెన్‌ స్కూల్‌ వరంలాంటిదని ట్రైనీ కలెక్టర్‌ కేఎస్‌ కల్పశ్రీ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఎన్‌రోల్‌మెంట్‌పై జిల్లా అధికారులతో సమావేశం నిర్వ హించారు.
కలెక్టరేట్‌లో ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఎన్‌రోల్‌మెంట్‌పై జిల్లా అధికారులతో సమావేశం

ట్రైనీ కలెక్టర్‌ మాట్లాడుతూ టెన్త్‌, ఇంటర్‌ పూర్తిచేసేందుకు మంచి సదవకాశమన్నారు. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదివినా సర్టిఫికెట్లకు రెగ్యులర్‌గా పరిగణిస్తారని వివరించారు. జిల్లా విద్యాశాఖాధికారి కె.శామ్యూల్‌ మాట్లాడుతూ ఈ ఏడాది 2023–24 విద్యాసంవత్సరంలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌లలో ఏపీ ఓపెన్‌ స్కూలులో ప్రవేశంపొందగోరువారు ఏపీ ఆన్‌లైన్‌, గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రవేశ నమోదుకోసం www.apopenschool.ap. gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. అపరాధ రుసుంలేకుండా ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అనంతరం ఏపీ సార్వత్రిక విద్యాపీఠం పోస్టర్లను ఆవిష్కరించారు.

Also read: Analog Astronaut Dangeti Jahnavi on CM Jagan's Support: Insights from Palakollu #sakshieducation

ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలి వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన ట్రైనీ కలెక్టర్‌, విద్యాశాఖ అధికారులు

#Tags