Admissions in IISER: ఐఐఎస్‌ఈఆర్‌లో బీఎస్-ఎంఎస్, బీఎస్ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్) 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్-ఎంఎస్(డ్యూయల్ డిగ్రీ), బీఎస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐఐఎస్‌ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2024 పరీక్ష నిర్వహిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐఐఎస్‌ఈఆర్ క్యాంపస్‌లు: బెర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి.
కోర్సులు
బీఎస్-ఎంఎస్(డ్యూయల్ డిగ్రీ): కోర్సు వ్యవధి-ఐదేళ్లు.
బీఎస్ డిగ్రీ: కోర్సు వ్యవధి-నాలుగేళ్లు.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఇంటర్మీడియట్(సైన్స్ స్ట్రీమ్) 2022, 2023, 2024 లో ఉత్తీర్ణులై ఉండాలి.
చదవండి: TS EAPCET 2024 Notification: ఈసారి ఏ కోర్సులు ఉన్నాయంటే..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 01.04.2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.05.2024
ఐఐఎస్‌ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఐఏటీ): 09.06.2024
వెబ్‌సైట్: https://iiseradmission.in/
Published date : 05 Mar 2024 03:15PM