Para Medical Courses: ఆన్‌లైన్‌లో పారా మెడికల్ కోర్సులకు మెరిట్ జాబితా
Sakshi Education
కాకినాడ క్రైం: 2023–24 విద్యా సంవత్సరానికి పారామెడికల్ డిప్లొమా కోర్సులకు గత నెల 30న విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి కాకినాడ రంగరాయ వైద్య కళాశాల యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రొవిజినల్ మెరిట్ లిస్టు విడుదల చేసినట్లు కళాశాల పర్యవేక్షణాధికారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు http://rmckakinada.com వెబ్‌సైట్‌కు లాగిన్ అయి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించుకోవాలని సూచించారు. అభ్యంతరాలుంటే వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు రంగరాయ వైద్య కళాశాలలోని జీ1 సెక్షన్‌లో పారామెడికల్ విభాగాన్ని నిర్వహిస్తున్న సంబంధిత అధికారిని సంప్రదించాలని కోరారు.
Published date : 31 Aug 2023 06:45PM