Medical Health Department: వెబ్‌సైట్‌లో అభ్యర్థుల మెరిట్ జాబితా
Sakshi Education
వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జరిగిన కార్యక్రమంలో భాగంగా విడుదల చేసిన వివిధ అభ్యర్థుల జాబితాలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినట్లు తెలిపారు..
సాక్షి ఎడ్యుకేషన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో నేషనల్ టీబీ ఎలిమినేషన్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది జూలై 31న విడుదల చేసిన వివిధ కేడర్ల ఉద్యోగ పార్టీ నోటిఫికేషన్‌కు సంబంధించి అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజినల్ మెరిట్ జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచినట్టు తెలిపారు.
Development of Gurukul Schools: గురుకుల విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు
జాబితాలో పేర్లను పరిశీలించుకునేందుకు ‘‘హెచ్‌టిటిపిఎస్://ఈస్ట్‌గోదావరి.ఎపి.జిఒవి.ఇన్’’ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే వచ్చేనెల 4వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో తమ వినతులు సమర్పించాలని డీఎంహెచ్‌వో నరసింహనాయక్ కోరారు.
Published date : 30 Sep 2023 01:28PM