Skip to main content

Tomorrow job fair news: రేపు జాబ్‌మేళా

Aurobindo Pharma representative at job fair  Tomorrow job fair news    College job fair with Aurobindo Pharma, MSS Labs, New Land Labs
Tomorrow job fair news

పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగులకు ఈ నెల 27న ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.పీవీ కృష్ణాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 27న ఉదయం 10 గంటలకు కళాశాల ఆవరణలో నిర్వహించనున్న జాబ్‌ మేళాకు హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా, ఎంఎస్‌ఎస్‌ ల్యాబ్స్‌, న్యూ ల్యాండ్‌ ల్యాబొరేటరీస్‌ సంస్థల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు.

ఈ ఉద్యోగమేళాకు హాజరు కాదలచిన అభ్యర్థులు బీఫార్మా, బీఎస్సీ కెమిస్ట్రీ, బీటెక్‌, ఇంటర్‌మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ ఉత్తీర్ణత కలిగి కనీసం 26 సంవత్సరాలు ఉండాలని పేర్కొన్నారు. ఇంటర్వ్యూల్లో ఎంపికై న అభ్యర్థులకు ఆర్‌బీఎస్‌ఎస్‌ అండ్‌ ఎఫ్‌ఎన్‌దాస్‌ పరిశ్రమ సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా విశాఖపట్నంలో నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

ఉద్యోగావకాశాల్లో భాగంగా నెలకు రూ.12,500 నుంచి రూ.20,000 వరకు వేతనాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఫోన్‌ 8688156216, 86880880562 నంబర్లకు సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

Published date : 27 Dec 2023 01:11PM

Photo Stories