Skip to main content

Jobs in IT sector: ఐటీ రంగంలో నెలకు 25 వేల ఉద్యోగాలు

Companies advised to support Tamil Nadu's IT job creation initiative., Companies urged to contribute to 25k IT jobs monthly in Tamil Nadu. TN IT sector should target 25000 Jobs monthly, Tamil Nadu aims for 25,000 IT sector jobs per month.

సాక్షి, చైన్నె: తమిళనాడులోని ఐటీ రంగంలో నెలకు 25 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఆయా సంస్థలకు రాష్ట్ర ఐటీ శాఖమంత్రి పళణి వేల్‌ త్యాగరాజన్‌ సూచించారు. సీఐఐ కనెక్ట్‌ 2023 లైఫ్‌ టైమ్‌ అచీవ్‌ మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం స్థానికంగా జరిగింది. ఇందులో రెడింగ్టన్‌ ఇండియా సహ వ్యవస్థాపకుడు ఆర్‌. శ్రీనివాసన్‌కు అవార్డును మంత్రి పళణి వేల్‌ త్యాగరాజన్‌ అందజేశారు. అలాగే కార్‌ టెక్నాలజీస్‌ సీఈఓ మారన్‌ నాగరాజన్‌కు ది ఎంట్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును, మహిళా పారిశ్రామికవేత్త అవార్డును క్రిడాక్స్‌ సహ వ్యవస్థాపకులు సౌమ్య మహదేవన్‌కు ప్రదానం చేశారు. అనంతరం జరిగిన టెక్‌ ఫర్‌ టుమారో అనే అంశంపై సీఐఐ కనెక్ట్‌ 2023లో మంత్రి ప్రసంగించారు. ఐటీ రంగంలో నెలకు 10 వేలకు బదులుగా 25 వేల ఉద్యోగాలను తమిళనాడులో కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్దామన్నారు. ఇందు కోసం ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఉపాధి, వృద్ధిపరంగా తోడ్పాటు, కొత్త ఆవిష్కరణలు విస్తృతం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఎస్‌ అధికారి అరుణ్‌ రాజ్‌, సీఐఐ ప్రతినిధులు శంకర్‌, వానవరాయర్‌, శ్రీ వత్స్‌ రామ్‌ కాగ్ని జెంట్‌ ఇండియా గణేష్‌ కల్యాణ రామన్‌, తదితరులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: 8773 Bank Jobs 2023: ఎస్‌బీఐలో జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు... ఎంపిక విధానం...

Published date : 22 Nov 2023 02:50PM

Photo Stories