State level best teachers awards: అధ్యాపకులకు రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారాలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): బోధన, పరిశోధన, ప్రాజెక్టుల రూపకల్పన, విద్యార్థులను తీర్చిదిద్దడం తదితర అంశాల్లో విశేష కృషి చేసిన ఆ అధ్యాపకులను రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారాలు వరించాయి. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యాన యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాల్లో పని చేసే అధ్యాపకులకు ఇచ్చే ఈ పురస్కారాలకు జిల్లా నుంచి ఆరుగురు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగే కార్యక్రమంలో వీరికి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారాలు అందజేయనున్నారు.
ఎంపికై న వారిలో జేఎన్‌టీయూకే మెకానికల్ ప్రొఫెసర్లు ఎ.గోపాలకృష్ణ, దుంపల లింగరాజు, ఈఈఈ ప్రొఫెసర్ ఆర్‌ఎస్ శ్రీనివాసరావు ఉన్నారు. అలాగే డిగ్రీ కళాశాల విభాగం నుంచి పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ అధ్యాపకుడు జెట్టి పాండురంగారావు, ఏఎస్‌డీ కళాశాల అధ్యాపకులు ఎం.సువర్చల, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు డాక్టర్ శ్రీపాద రమశ్రీ ఉన్నారు. వారిని పలువురు అభినందించారు.
Tags
- Education News
- Latest News in Telugu
- State level best awards for teachers
- Awards
- Teachers
- Telugu News
- Today News
- news app
- Breaking news
- news bulletin
- news daily
- news for today
- news for school
- news today ap
- andhra pradesh news
- Google News
- East Godavari District News
- East Godavari District Latest News