Provisional Merit List: వెబ్‌సైట్‌లో ప్రొవిజనల్ మెరిట్ జాబితా
Sakshi Education
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ స ర్వజన ఆస్పత్రుల్లో రెండు కేటగిరీల్లో ఖాళీల భర్తీకి సంబంధించిన రివైజ్‌డ్ ప్రొవిజనల్ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రకల్ హెల్పర్, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులకు సంబంధించి రివైజిడ్ ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విజయనగరం.ఏపీ.జిఓవి. ఇన్ వెబ్‌సైట్ పొందుపరిచినట్టు చెప్పారు. అభ్యంతరాలు ఉంటే 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ప్రభుత్వ వై ద్య కళాశాలలో తెలియజేయాలన్నారు. ఎలక్ట్రీషియన్, ఆఫీ స్ సబార్డినేట్, స్టోర్ అటెండర్ పోస్టులకు స్పీకింగ్ ఆర్డర్స్ వివరాలు కూడా వెబ్ సైట్‌లో పొందుపరిచామన్నారు.
చదవండి: Employment Exchange Services: ఆన్‌లైన్‌లో ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజి సేవలు
Published date : 19 Jan 2024 04:17PM