Employment Exchange Services: ఆన్‌లైన్‌లో ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజి సేవలు
రంపచోడవరం: చింతూరు, రంపచోడవరం డివిజన్లో యువతీ యువకులు ఇక నుంచి ఆన్‌లైన్‌లో ఎంప్లాయ్‌మెంట్ కార్డులను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చునని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే వెల్లడించారు. గురువారం స్థానిక ఐటీడీఏ క్యాంప్ కార్యాలయంలో ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కరపత్రాలను ప్రాజెక్ట్ అధికారి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, ఫొటోలు, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఆన్‌లైన్ ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చునన్నారు. గతంలో కార్డులు పొందిన వారు వాటిని ఆన్లైన్ ద్వారానే రెన్యువల్ చేసుకోవచ్చన్నారు. రంపచోడవరం ఐటీడీఏ ప్రాంగణంలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో కూడా సంబంధిత సర్టిఫికెట్లతో వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. employment. ap.gov.in వెబ్‌సైట్‌లో ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్‌కు వివరాలు అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.అబు సలాం, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ఎ. సంగీత. కె.రాంబాబు పాల్గొన్నారు.
చదవండి: ITI students: ఐటీఐ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులో ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..