రేపు మెగా జాబ్‌మేళా
దేశవ్యాప్తంగా వివిధ కంపెనీల్లో దాదాపు 5వేల ఖాళీలకు సంబంధించి జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫ్రెష్, అనుభవం కలిగిన గ్రాడ్యుయేట్లు, పోసు్ట్రగాడ్యుయేట్లు, నాన్ గ్రాడ్యుయేట్లు సైతం నేరుగా జాబ్ ఫెయిర్‌కు హాజరుకావచ్చని తెలిపారు.
తహసీల్దార్ సస్పెన్షన్
వీరపునాయునిపల్లె : వీరపునాయునిపల్లె మండల తహసీల్దార్ రమేష్‌ను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టరేట్ నుంచి ఉత్తర్వు లు జారీ అయ్యాయి. ఈయనతో పాటు టైపిస్ట్ అజయ్‌కుమార్‌ను కూడా విధుల నుంచి తొలగించారు. వీరిద్దరు రైతుల భూములకు సంబందించి కేవలం నెలరోజుల వ్యవధిలోనే 89 మ్యుటేషన్‌లు నిర్వహించారు. మ్యుటేషన్‌లు నిర్వహణలో అవతవకలకు పాల్పడినట్లు పలువురు రైతుల నుంచి ఆరోపణలు రావడంతో జిల్లా స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో 38 మ్యుటేషన్‌లకు సంబందించిన రికార్డులు కార్యాలయంలో అందుబాటులో లేనట్లు తేలింది. దీంతో వీరిద్దరిని విధుల నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
నూతన నియామకం
కడప కార్పొరేషన్ : కడప జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ప్రత్యేకాధికారిగా టి.శివశంకర్‌రెడ్డిని జిల్లా కలెక్టర్ నియమించారు. ఆయన ఇదివరకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. మొదటి నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరిగే బ్లడ్‌క్యాంపుల్లో 70 సార్లు రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.
డీసీఈబీ సెక్రటరీగా శంకరయ్య
కడప ఎడ్యుకేషన్ : జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) సెక్రటరీగా శంకరయ్య నియమితులయ్యారు. గతంలో పనిచేపిర శోభారాణి ప్రొద్దుటూరు ఎంఈఓ–2గా వెళ్లారు. శంకరయ్య కడప శంకరాపురంలోని ప్రభుత్వ అంధుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసేవారు.
వైవీయూలో అధ్యాపకులకు పదోన్నతులు
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు అధ్యాపకులకు పదోన్నతులు కల్పి స్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీంలో భాగంగా నిర్వహించిన ఈ పదోన్నతులలో ముగ్గురికి ప్రొఫెసర్లుగాను, ఒకరికి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించారు. ఇందులో సహ ఆచార్యులుగా పనిచేస్తున్న జి. కాత్యాయని (అప్‌లైడ్ మ్యాథమాటిక్స్), డి. విజయలక్ష్మి (మైక్రోబయాలజీ), ఎం.ఎం. వినోదిని (తెలుగు)లకు ప్రొఫెసర్లుగా పదో న్నతులు కల్పించారు. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కె. శ్రీనివాసరావుకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదో న్నతి కల్పించారు. వీరికి వీసీ సుధాకర్, రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య నియామకపత్రాలను అందజేశారు.
ఫలితాలు విడుదల
యోగివేమన విశ్వవిద్యాలయం అనుబంధ న్యాయ కళాశాలల విద్యార్థుల సెమిస్టర్ ఫలితాలను బుధవారం వీసీ చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి.వెంకటసుబ్బయ్య, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డి విడుదల చేశారు.
28న ఎకై ్సజ్ వాహనాల వేలం
మదనపల్లె : మదనపల్లె స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్‌ఈబీ) స్టేషన్ పరిధిలో గతంలో ప్రొహిబిషన్, ఎకై ్సజ్ నేరాల్లో సీజ్‌చేసిన వాహనాలను శుక్రవారం బహిరంగ వేలం వేయనున్నట్లు సీఐ శ్రీహరిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు మదనపల్లె ఎస్‌ఈబీ స్టేషన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ సమక్షంలో వేలంపాట జరుగుతాయన్నారు. వివరాలకు ఎస్‌ఈబీ ఇన్స్‌పెక్టర్‌ను 9440902595 నంబర్‌లో సంప్రదించాలన్నారు.