Skip to main content

Lecturer posts: లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Lecturer posts
Lecturer posts

శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్‌)లో ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టుల్లో డిప్యూటేషన్‌పై పని చేసేందుకు ఉమ్మడి జిల్లాలో ఆసక్తి ఉన్న ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ నాగరాజు తెలిపారు.

ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కనీసం పదేళ్లు బోధనలో అనుభవం ఉండి, 58 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉందని తెలిపారు.

రఖాస్తుకు సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాలు జతచేసి నవంబరు నాలుగో తేదీన సాయంత్రం 5 గంటల్లోపు డైట్‌ కళాశాలలో అందజేయాలని సూచించారు.

Published date : 30 Oct 2023 08:03PM

Photo Stories