Skip to main content

Job Mela: September 16న జాబ్‌మేళా (MSN Group of Companies)

జగిత్యాలటౌన్‌: ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ లేదా బైపీసీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఎన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలో ఉపాధితో పాటు ఉన్నత విద్య అవకాశం కల్పించేందుకు ఈనెల 16న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి బింగి సత్యమ్మ ప్రకటనలో తెలిపారు.
16న జాబ్‌మేళా,Intermediate MPC or BIPC Students, MSN Group of Companies in Hyderabad
16న జాబ్‌మేళా

17 నుంచి 20 ఏళ్ల వయసు కలిగి ఉండి ఎస్సెస్సీలో 60శాతం మార్కులు, ఇంటర్‌ 55 శాతం మార్కులతో లేదా బైపీసీ లేదా ఒకేషనల్‌ కోర్సు (బ్రిడ్జి కోర్సు యందు కెమిస్ట్రీ సబ్జెక్టు) ఉత్తర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఒకే ప్రయత్నంలో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలని అలాగే ఇంటర్మీడియెట్‌ 2022–23 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులని తెలిపారు. ఎంపికై నవారికి రూ.11,000 స్థూల వేతనం, కుటుంబ సభ్యుల కోసం ఎంప్లాయి స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కూడా కంపెనీ వారు కల్పిస్తారని తెలిపారు.

Teacher job సాధిచండానికి సులభమైన మార్గం.. #sakshieducation

హైదరాబాద్‌లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుంచి ఉచిత ఉన్నత విద్య (బీఎస్సీ కెమిస్ట్రీ)స్పాన్సర్‌ చేయనున్నట్లు వివరించారు. మొదటి రెండు సంవత్సరాలు సబ్సిడీ, వసతి క్యాంటీన్‌ సౌకర్యం, ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తారని పేర్కొన్నారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం జిల్లా కార్యాలయాల సముదాయం రూం నం. 218లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తామని, మరిన్ని వివరాలకు 76600 94470, 80968 88868 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

G20 Summit 2023-Biofuel Alliance: అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి..ప్రపంచ లీడర్ గా భారత్ #sakshieducation

Published date : 15 Sep 2023 09:12AM

Photo Stories