Skip to main content

IT Jobs Recruitment : ఉద్యోగుల తొలగింపే కానీ.. ఆఫర్‌ లెటర్స్ లేవ్‌.. అస‌లు ఐటీలో జరుగుతుంది ఇదేనా..?

గత కొంత కాలంగా ఐటీ రంగంలో గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోంది. దిగ్గజ కంపెనీలు సైతం ఆఫర్‌ లెటర్లు ఇచ్చినా.. జాయినింగ్‌ లెటర్స్‌ జారీలో జాప్యం, సంస్థలో తొలగింపులు వంటివి చేపడుతున్నాయి.

ఇవి ఆ రంగంలోని ఉద్యోగులను, ఐటీ కొలువు కోసం వేచి చూస్తున్న విద్యార్ధులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాకుండా మరికొన్ని సంస్థలు.. ఆఫర్‌ లెటర్స్‌ ఇచ్చిన వారికి.. సదరు ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లుగా సమాచారం కూడా ఇస్తున్నాయి.

Microsoft Employees : భారీగా ఉద్యోగాల తొల‌గింపు వాస్త‌వ‌మే..కానీ ఇలా కాదు..

ఆఫర్‌ లెటర్లు ఇచ్చిన.. ఇప్పుడు వెనక్కి తీసుకోవడంతో..

Software jobs

ఇలా ఆఫర్‌ తిరస్కరణ సందర్భంలో.. ‘మా సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా మీ అర్హతలు లేవు’ అనో.. లేదా మీ ప్రొఫైల్ కు సరిపడే సర్టిఫికేషన్స్‌ పూర్తి చేయలేదు’ అనో పేర్కొంటున్నాయి. దీంతో క్యాంపస్‌ డ్రైవ్‌లో తమ అకడమిక్‌ ప్రతిభను, మార్కులను, స్కిల్స్‌ను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసి, ఆఫర్‌ లెటర్లు ఇచ్చిన సంస్థలు.. ఇప్పుడు వెనక్కి తీసుకోవడం ఏంటి? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

Financial Crisis : ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం.. ఉద్యోగ నియామకాలను..

ఉద్యోగుల తొలగింపు కార‌ణాలు ఇవేనా..?

it employees

☛  ప్రస్తుత పరిస్థితుల్లో పలు ఎంఎన్‌సీ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు ఉంటాయనే సంకేతాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
☛  ఇప్పటికే ఫేస్‌బుక్‌ ఆధ్వర్యంలోని మేటా సంస్థలో 12 వేల మందిని పనితీరు ప్రతిపాదికగా తొలగించనున్నట్లు ప్రకటించారు.
☛  దాదాపు 1.15 లక్షల ఉద్యోగులు ఉన్న ఇంటెల్‌ సంస్థ.. అంతర్జాతీయంగా 20 శాతం మేరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. 
☛  దేశీయంగానూ ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ రెండున్నర వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక గూగుల్‌ సంస్థ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో నికర రాబడిలో తగ్గుదలతో నూతన నియామకాల విషయంలో కొంతకాలం స్వీయ నిషేధం విధించింది.

Jobs : ఇంటెల్ చరిత్రలోనే తొలిసారిగా.. భారీగా ఉద్యోగులను తొల‌గింపు.. ఎందుకంట‌..?!

ఆర్ధిక మాంద్యం సంకేతాలే కారణమా..!

financial crisis

☛  ఐటీలో ఆన్‌బోర్డింగ్‌ ఆలస్యానికి అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందనే సంకేతాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశంలోని సంస్థల్లో అధిక శాతం అమెరికాలోని కంపెనీలకు ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో సేవలందిస్తున్నాయి. అమెరికా మాంద్యం ముంగిట నిలిచిందనే అంచనాల కారణంగా.. అక్కడి కంపెనీల్లో కార్యకలాపాలు మందగిస్తున్నాయి. ఫలితంగా ఆయా సంస్థలు కొత్త ప్రాజెక్ట్‌ల విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
దీంతో.. సదరు సంస్థలకు సేవలపై ఆధారపడిన మన ఐటీ కంపెనీలపై ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇది అంతిమంగా ఆన్‌ బోర్డింగ్‌లో జాప్యానికి కారణమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, అంతర్జాతీయ ఒడిదుడుకుల కారణంగా కొత్త ప్రాజెక్ట్‌లు రావడం కొంత కష్టంగా ఉంది. ఇది కూడా ఆన్‌ బోర్డింగ్‌లో జాప్యానికి మరో కారణమని చెబుతున్నారు.

Work From Home : వర్క్ ఫ్రమ్ హోమ్‌పై ఉద్యోగులకు కీలక ఆదేశాలు ఇవే..

Published date : 26 Oct 2022 07:34PM

Photo Stories