Skip to main content

8113 Railway jobs Notification: రైల్వేలో 8113 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Railway jobs
Railway jobs

రైల్వేలో ఏదైనా డిగ్రీ విద్యార్హతతో 8,113 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 

అంగన్‌వాడీలో భారీగా ఉద్యోగాలు..10వ తరగతి అర్హతతో: Click Here

భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు సెప్టెంబర్ 14వ తేదీ నుండి అక్టోబర్ 13వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ? ఎలా అప్లై చేసుకోవాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది? వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ లో చదివి తెలుసుకొని ఈ ఉద్యోగాలకు మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పనిసరిగా త్వరగా అప్లై చేయండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్

భర్తీ చేస్తున్న పోస్టులు : చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం పోస్టుల సంఖ్య: 8113

అర్హత: ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు

అప్లికేషన్ విధానం: ఆన్లైన్ లో అప్లై చేయాలి

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 14-09-2024

అప్లై చేయడానికి చివరి తేదీ: 13-10-2024

కనీస వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

గరిష్ట వయస్సు: ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 36 సంవత్సరాలు.

వయస్సు సడలింపు:  భారత ప్రభుత్వ నిబంధనల మేరకు క్రింది తెలిపిన విధంగా వయో సడలింపు కలదు. అనగా క్రింది విధంగా వయో సడలింపు ఉంటుంది. 

ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు కలదు.
ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు కలదు.
PwBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది: CBT -1 , CBT -2 , డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతం:
చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు లెవెల్ – 6 ప్రకారం ప్రారంభంలో 35,400/- జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.
గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ లెవెల్ – 5 ప్రకారం ప్రారంభంలో 29,200/- జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.

ఫీజు:
SC, ST , ఈబీసీ , ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులుకు – 250/-
మిగతా అభ్యర్థులకు 500/- రూపాయలు
పరీక్ష రాసిన అభ్యర్థులకు బ్యాంకు చార్జీలు మినహాయించి ఫీజు రిఫండ్ కూడా చేయడం జరుగుతుంది.
SC, ST , ఈబీసీ , ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులుకు పూర్తి ఫీజు రిఫండ్ చేస్తారు. 
మిగతా వారికి 400/- రిఫండ్ చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చెయాలి: క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

Download Full Notification: Click here
 

Published date : 14 Sep 2024 08:59PM
PDF

Photo Stories