Technology: టెక్నాలజీలో యువతకు ఉచిత శిక్షణ
కడప ఎడ్యుకేషన్: విజయవాడలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆ్‌ఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ) ద్వారా ఓబీసీ, ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి అందిస్తున్నట్లు సంస్థ జాయింట్ డైరెక్టర్ అండ్ హెడ్ డాక్టర్ సీహెచ్ శేఖర్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ యువతకు పాలిమర్స్ టెక్నాలజీ నందు మెషీన్ ఆపరేటర్(ప్లాస్టిక్ ప్రాసెసింగ్) మరియు మెషీన్ ఆపరేటర్ అసిస్టెంట్(ప్లాస్టిక్ ప్రాసెసింగ్) కోర్సులలో 3 నుంచి 6 నెలల పాటు శిక్షణను ఇవ్వనున్నారు.
అనంతరం వివిధ సంస్థలలో ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నామన్నారు. శిక్షణాకాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలను అందిస్తామని.. అభ్యర్థులు తమ విద్యార్హత, కులం, ఆదాయ దృవీకరణ పత్రాలు, ఆధార్, రేషన్‌కార్డులతో పాటు నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో 6300147965 నంబరులో సంప్రదించాలన్నారు.
Tags
- Free training
- Free training in courses
- free training program
- youth in technology
- Free training for youth in technology
- Free training for unemployed youth
- General Knowledge Science & Technology
- Latest News in Telugu
- Telangana News
- telugu breaking news
- news today
- Kadapa
- Skill Development Programs
- CIPET Vijayawada